క్రీడల్లో ప్రావీణ్యం అవసరం
ధర్మవరం టౌన్ : క్రీడల్లో ప్రావీణ్యం సంపాదిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని శాప్ మాజీ కోచ్ ఇస్మాయిల్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఆర్డీటీ గ్రౌండ్స్‌లో తొలిసారిగా ఫైవ్ సైడ్ (ఐదుగురు ఆటగాళ్లతో) హాకీ టోర్నీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాప్ మాజీ కోచ్ ఇస్మాయిల్ హాజరై టోర్నీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర హాకీ అసోసియేషన్ కార్యదర్శి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు ధర్మవరంలో ఫైవ్సైడ్ హాకీ టోర్నీని నిర్వహిస్తున్నామన్నారు.
జిల్లాలో హాకీ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. తొలిరోజు మొత్తం 8 జట్లు పోటీల్లో పాల్గొనగా బీఎస్ రాయుడు టీం, దుర్గన్న టీంలు ముందంజలో ఉన్నాయి. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ వడ్డే బాలాజీ, ధర్మాంబ హాకీ అసోసియేషన్ సెక్రెటరీ బందనాథం సూర్యప్రకాష్, పీడీలు అంజన్న, రఘునాథ్, పీఈటీలు ఓబులేసు, కోచ్హస్సేన్ తదితరులు పాల్గొన్నారు.