1న వ్యవసాయ వర్సిటీ స్పాట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్యవిద్యాలయంలో వివిధ డిప్లమో కోర్సుల ప్రవేశానికి మిగిలిన సీట్ల భర్తీ కోసం అక్టోబర్ 1న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9.30కి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో కార్యక్రమం మొదలవుతుందని పేర్కొన్నారు. ఇదివరకే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.