తిరుమల సమాచారం
తిరుమల: తిరుమల శ్రీవారికి శనివారం ఉదయం ప్రత్యేక సహస్ర కలశాభిషేకం సేవ జరగనుంది. ఆలయంలోని భోగ శ్రీనివాసమూర్తికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు 1008 కలశాలతో ఈ సేవను అర్చకులు నిర్వహిస్తారు. ఏటా ఈ సేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు శనివారం ఆలయంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది.