sri chaitaniya school
-
శ్రీచైతన్య స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి
-
ఉత్సాహం .. ఉద్వేగం.. రసవత్తరంగా సాగుతున్న ఎస్పీఎల్ క్రికెట్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో జరుగుతున్న సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా.. ఉద్వేగంగా సాగుతున్నాయి. ఆదివారం రెండోరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీచైతన్య జూనియర్ కళాశాల – వెలాసిటీ జూనియర్ కళాశాల జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీచైతన్య జూనియర్ కళాశాల జట్టు 74 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్ చేసిన వెలాసిటీ జూనియర్ కళాశాల జట్టు 52 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. దీంతో శ్రీచైతన్య జూనియర్ కళాశాల జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన ఎస్బీఐటీ డిప్లొమా కాలేజీ జట్టు తన ప్రత్యర్థి ఏఎస్ఆర్ జూనియర్ కళాశాలపై నెగ్గి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఏఎస్ఆర్ జట్టు పరిమిత ఓవర్లకు 63 పరుగులు సాధించగా బ్యాట్స్‌మెన్ ముస్తఫా 19 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్బీఐటీ జట్టు సునాయాసంగా లక్ష్యం సాధించింది. దీంతో ఎస్బీఐటీ డిప్లొమా కాలేజీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. కిట్స్ డిప్లొ మా కాలేజీ ఖమ్మం – అనుబోస్ డిప్లొమా కళాశాల పాల్వంచ జట్ల మ్యాచ్‌లో.. ముందుగా టాస్ గెలిచిన అనుబోస్ డిప్లొమా జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కిట్స్ జట్టు 78 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన అనుబోస్ జట్టు 40 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దీంతో కిట్స్ డిప్లొ మా కళాశాల జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. మొదటి రౌండ్లో బొమ్మ కాలేజీ విజయభేరి.. బొమ్మ డిప్లొమా కాలేజీ – వాణి ఐటీఐ ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వాణి ఐటీఐ జట్టు పరిమిత ఓవర్లలో 71 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్ చేసిన బొమ్మ డిప్లొమా కాలేజీ జట్టు 72 పరుగులు సాధించింది. రెండో మ్యాచ్‌లో ఆర్జేసీ జూనియర్ కళాశాల – ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కొత్తగూడెం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్జేసీ జట్టు కేవలం 44 పరుగులు చేయగా.. తర్వాత బ్యాటింగ్ చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కొత్తగూడెం జట్టు ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో కృష్ణవేణి జూనియర్ కళాశాల 2– వెలాసిటీ జూనియర్ కళాశాల ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కృష్ణవేణి జట్టు 53 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ చేసిన వెలాసిటీ జూనియర్ కళాశాల జట్టు నాలుగు వికెట్ల నష్టంతోనే లక్ష్యం సాధించింది. మూడో మ్యాచ్‌లో రెజొనెన్స్ జూనియర్ కళాశాల (మెయిన్ క్యాంపస్) – ముదిగొండ జూనియర్ కళాశాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెజొనెన్స్ జూనియర్ కళాశాల (మెయిన్ క్యాంపస్) నిర్ణీత ఒవర్లలో 7 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ముదిగొండ జూనియర్ కళాశాల జట్టు పరిమిత ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసి ఓటమి పాలైంది. దీంతో రెజొనెన్స్ జూనియర్ కళాశాల జట్టు ఘన విజయం సాధించింది. జట్టు కెప్టెన్ రేవంత్ చక్కని ప్రతిభ కనబరిచిచాడు. చదవండి: IND vs NZ: కుల్దీప్ మ్యాజిక్ డెలివరి.. దెబ్బకు కివీస్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్ -
శ్రీ చైతన్య స్కూల్ బస్ బోల్తా, విద్యార్థులకు గాయాలు
సాక్షి, నెల్లూరు : శ్రీ చైతన్య స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. డక్కిలి మండలం కమ్మపల్లి రోడ్డు సమీపంలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. విద్యార్థులను స్కూల్‌కు తీసుకువెళుతున్న సమయంలో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి కల్వర్టును ఢీకొని వంతెనపై నుంచి బోల్తాపడింది. సుమారు పదిమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై మృతి కాగా ఆత్మకూరు మండలం వాసిలి సమీపంలో కారు...పందిని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఏఎస్సై రాజు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. -
అండర్-14 నాకౌట్ టోర్నీ లో ప్రజ్ఞయ్ శతకం
జింఖానా, న్యూస్‌లైన్: శ్రీ చైతన్య స్కూల్ బ్యాట్స్‌మన్ ప్రజ్ఞయ్ రెడ్డి (120) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఆ జట్టు 157 పరుగుల భారీ తేడాతో హెచ్‌పీఎస్ (బేగంపేట్) జట్టుపై ఘన విజయం సాధించింది. హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీ చైతన్య స్కూల్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. గౌరవ్ రెడ్డి (76) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హెచ్‌పీఎస్ జట్టు 110 పరుగులకే కుప్పకూలింది. నిఖిల్ (44) మెరుగ్గా ఆడాడు. శ్రీ చైతన్య బౌలర్లు దీపక్, ఆశిష్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. మరో మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ వరుణ్ గౌడ్ (114), వికాస్ (107) సెంచరీలతో గౌతమ్ మోడల్ స్కూల్ జట్టు 177 పరుగుల భారీ తేడాతో హెచ్‌పీఎస్ (రామంతపూర్) జట్టుపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గౌతమ్ మోడ ల్ స్కూల్ 8 వికెట్ల నష్టానికి 400 పరుగుల భారీ స్కోరు చేసింది. అజయ్‌దేవ్ గౌడ్ (57), సాగర్ చౌరాసియా (56) అర్ధ సెంచరీలతో రాణించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన హెచ్‌పీఎస్ 223 పరుగుల వద్ద ఆలౌటైంది. తరుణ్ (62), అమోఘ్ రాహుల్ (65) అర్ధ సెంచరీలు సాధించారు.