sri padmavathi ammavaru
-
చంద్రగిరి : స్వర్ణరథంపై సౌభాగ్యలక్ష్మీమగా శ్రీ పద్మావతి అమ్మవారు (ఫొటోలు)
-
చంద్రగిరి : శ్రీమహాలక్ష్మి అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారు (ఫొటోలు)
-
అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ ఆభరణాలు
తిరుచానూరు: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మూడో రోజైన గురువారం ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి సింహవాహనంపై పద్మావతి అమ్మవారు ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి రోజూ మధ్యాహ్నం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో అమ్మవారికి అలంకరించేందుకు ఏడురకాల మాలలు, కిరీటం, కుచ్చు జడను వినియోగిస్తారు. మామూలుకు భిన్నంగా అమ్మవారి అలంకరణార్థం తమిళనాడు రాష్ట్రం తిరుపూర్‌కు చెందిన రాజేందర్ అనే భక్తుడు బాదం పప్పు, వట్టి, కురు వేర్లు, రోస్ పెటల్స్, సంపంగిని ఉపయోగించి మాలలు, కిరీటం, కుచ్చు జడను తయారుచేయించారు. వీటిని బుధవారం టీటీడీ ఉద్యానవనశాఖ డిప్యుటీ డెరైక్టర్ శ్రీనివాసులకు అందజేశారు. వీటిని అమ్మవారికి స్నపన తిరుమంజనంలో అలంకరించారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు దాత సహకారంతో వైవిధ్య మాలలు, కిరీటం, కుచ్చు జడను ఆలయ అర్చకులకు అందించనున్నట్లు శ్రీనివాసులు తెలిపారు. అలాగే తిరుమంజనంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేందుకు న్యూజిలాండ్ కివీ ఫ్రూట్స్, ఆస్ట్రేలియా ఆరెంజ్, అమెరికన్ గ్రేప్స్, డేట్స్ తదితర పండ్లను దాత అందించినట్లు తెలిపారు. -
కల్పవృక్షంపై కల్పవల్లి
తిరుచానూరు : తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శనివారం ఉదయం కల్పవల్లి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు కోర్కెలను తీర్చే కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అంతకుముందు అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారిని ఆలయంలోని అద్దాలమండపం నుంచి వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర స్వర్ణాభరణాలతో కుడి చేతిలో చర్ణాకోలు, ఎడమ చేతిలో రాజదండం, నడుములో వేణువు, బుర్రను ధరించి గోవులను పాలించే రాజగోపాలునిగా అలంకరించారు. అనంతరం 8గంటలకు జీయర్ల దివ్య ప్రబంధ పారాయణం, మంగళ వాయిద్యం, చిన్నారుల కోలాటం, దాససాహితీ భజన బృందం, కళాకారుల నృత్య ప్రదర్శన, భక్తుల గోవింద నామస్మరణ నడుమ అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి అమ్మవారు హనుమంతుని వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. వాహనసేవలో టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న పాల్గొన్నారు. -
తిరుచానూరులో ఫలపుష్ప ప్రదర్శన