sri vishnu campous
-
స్టార్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరోయిన్!
శ్రీవిష్ణు, రెబా మోనిక జంటగా నటించిన తాజా చిత్రం సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్ మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించారు. జూన్ 29 న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబట్టింది. చిన్న సినిమా అయినా సరే సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ మలయాళీ ముద్దుగుమ్మ రెబా మోనిక. మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ చక్కగా మాట్లాడేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రెబా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. (ఇది చదవండి: ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు అప్పులు.. కల్యాణి విడాకులకు కారణమిదే!) రెబా మోనిక మాట్లాడుతూ..' జెర్సీలో నానితో పనిచేసే అవకాశం వచ్చింది. కానీ నేను ఆయనకు కూడా అభిమానే. అల్లు అర్జున్‌కు నేను బిగ్ ఫ్యాన్. ఆయనకు మలయాళంలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ ఆయను మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఏ హీరోకు లేని క్రేజ్ అల్లు అర్జున్‌కు మాత్రమే ఉంది. అల్లు అర్జున్ మూవీస్‌కు మలయాళంలో చాలా క్రేజ్ ఉంది.' అని అన్నారు. తెలుగులోకి రాకముందు మిమ్మల్ని ఒక స్టార్ హీరో డేట్‌కు పిలిచారని ప్రశ్నించగా రెబా మోనిక స్పందించింది. హీరో డేట్‌కు పిలవడంపై మాట్లాడుతూ..' అవును.. అలా జరిగింది. డేట్‌కు పిలిచారు.. కానీ నేను వెళ్లానా? లేదా అన్నదే ముఖ్యం. కానీ నేను వెళ్లలేదు అంటూ చెప్పుకొచ్చింది భామ. డేట్‌కు వెళ్లడమనేది తప్పుగా భావించాల్సిన విషయం కాదని. ' అని అన్నారు. (ఇది చదవండి: విజయ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాపై తమన్నా కామెంట్) -
‘శ్రీ విష్ణు’ క్యాంపస్‌లో సోలార్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరెంటు సమస్యల నుంచి గట్టెక్కేందుకు విద్యా సంస్థలు కూడా ప్రస్తుతం సౌర విద్యుత్ వైపు మళ్లుతున్నాయి. తాజాగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో తమ క్యాంపస్‌లో 200 కి.వా. రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేసుకుంది. సంస్థ చైర్మన్ కె.వి. విష్ణురాజు, రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎం. కమలాకర్ బాబు శనివారం దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ. 2.6 కోట్లు కాగా, కేంద్రం 30 శాతం మేర గ్రాంట్ ఇస్తోంది. దీనితో ఏటా 3 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఇది దాదాపు 10 శాతం మేర క్యాంపస్ విద్యుత్ అవసరాలను తీర్చగలదని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.