srikanya theatre
-
అనుకోని ఆపద.. అంతా బూడిద
విశాఖపట్నం, గాజువాక: తెలతెలవారుతుండగానే గాజువాక ఉలిక్కిపడింది. నిద్ర నుంచి తేరుకోకముందే ఎగసి పడుతున్న మంటలు, అగ్నిమాపక శకటాల హారన్లతో గాజువాక వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. గాజువాక మెయిన్రోడ్లోని శ్రీకన్య సినీ కాంప్లెక్స్‌లో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంతో స్థానికులు ఒకింత దిగ్భ్రాంతికి గురయ్యారు. సోమవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు, అగ్నిమాపక విభాగం అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాక మెయిన్ రోడ్‌లోని కన్య, శ్రీకన్య కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు థియేటర్లు కాలి బూడిదయ్యాయి. ఒకే భవనంలో మూడు సినిమా థియేటర్లు కొనసాగుతున్న విషయం తెలిసిం దే. పై అంతస్తులో చోటు చేసుకున్న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆధునిక పరికరాలతో కూడిన శ్రీకన్య (స్క్రీన్–2), హెవెన్ (స్క్రీన్–3)లకు చెందిన ప్రొజెక్టర్లు, సినిమా తెరలు, ఏసీ యూనిట్లు, కుర్చీలు పూర్తిగా కాలిపోయాయి. థియేటర్ స్లాబుపై ఏర్పాటు చేసిన సెల్ టవర్లు కూడా దెబ్బ తిన్నట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎనిమిది అగ్నిమాపక శకటాలతో ప్రయత్నించిన అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేయగలిగారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫైరింజన్లు వచ్చేలోపే సర్వం ఆహుతి సోమవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో శ్రీకన్య థియేటర్ స్క్రీన్కు సమీపంలో గల ఒక బల్బు పేలింది. ఆ సమయంలో ఎలక్ట్రికల్ బోర్డు నుంచి దట్టమైన పొగ మొదలైంది. దీన్ని గమనించిన స్వీపర్ చిట్టెమ్మ ఈ విషయాన్ని మేనేజర్‌కు తెలియజేసింది. ఆయన ఫిర్యాదుతో తొలుత పెదగంట్యాడ అగ్నిమాపక శకటంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే భారీస్థాయిలో మంటలు ఎగసి పడుతుండటంతో హెచ్‌పీసీఎల్, హిందూస్తాన్ షిప్‌యార్డు, కోరమాండల్, విశాఖ స్టీల్‌ప్లాంట్, గాజువాక ఆటోనగర్లకు చెందిన ఫైరింజన్లు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని సుమారు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే థియేటర్లు పూర్తిగా దగ్ధమై కోట్ల రూపాయల్లో ఆస్తినష్టం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎంత నష్టపోయామన్న విషయాన్ని థియేటర్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించలేదు. తమ ఇంజినీర్లు వచ్చి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని థియేటర్ మేనేజర్ రమణబాబు అటు పోలీసులకు, ఇటు రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక అధికారులకు తెలిపారు. అధికారుల పర్యవేక్షణ ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే వివిధ విభాగాల కు చెందిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నగర డీసీపీ ఫకీరప్ప, సౌత్ జోన్ ఇన్‌ఛార్జి ఏసీపీరంగరాజు, గాజువాక సీఐ కె.రామారావు, వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్ఐలు, రెవెన్యూ అధికారులు ఇక్కడిపరిస్థితిని సమీ క్షించారు. మంటలను అదుపు చేయడానికి దగ్గరుండి ప్రయత్నించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఫోరెన్సిక్ అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించారు. ప్రమాదంపై లోతైన విచారణ చేపడతామని డీసీపీ ఫకీరప్ప తెలిపారు. పని చేయని ఫైర్ టెండర్లు థియేటర్లో అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన ఫైర్ టెండర్లు సమయానికి పని చేయలేదు. అవి పని చేసి ఉంటే కొంతమేరకైనా ఆస్తిని పరిరక్షించుకొనే వీలుండేదని ఫైర్ సిబ్బంది తెలిపారు. కావాల్సినంత నీరు, ప్రతి ఫ్లోర్‌కు పైప్లైన్లు ఉన్నప్పటికీ నీరు పంపాల్సిన వాల్వు తెరుచుకోలేదు. వారం రోజుల క్రితం ఇక్కడ మాక్ డ్రిల్ చేసినట్టు కూడా సిబ్బంది చెబుతున్నారు. మాక్‌డ్రిల్‌లో పని చేసిన థియేటర్ ఫైర్ టెండర్ ఇప్పుడు పని చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఈ రెండు థియేటర్లలోను సుమారు 750 మంది ప్రేక్షకులు కూర్చొనేందుకు కుర్చీలున్నాయి. థియేటర్లకు సిబ్బంది కూడా రాకముందే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ఎవరికీ ఏమీ కాలేదు. సినిమా ప్రదర్శన సమయంలో ప్రమాదం జరిగి ఉంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
గాజువాక శ్రీకన్య కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
గాజువాక(విశాఖ): విశాఖ జిల్లా గాజువాకలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెయిన్రోడ్లోని శ్రీకన్య కాంప్లెక్స్‌లోని శ్రీకన్య, శ్రీకన్య హెవెన్ థియేటర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో రెండు, మూడు అంతస్తులు దగ్ధమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని థియేటర్ యాజమాన్యం, పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో థియేటర్ల నుంచి పొగలు వస్తున్నట్టు స్వీపర్ చిట్టెమ్మ నుంచి సమాచారం అందుకున్న మేనేజర్ రమణబాబు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికే రెండు థియేటర్లలోని ప్రొజెక్టర్లు, తెర (స్క్రీన్)లు, కుర్చీలు, ఏసీ యూనిట్లు, ఫర్నిచర్ కాలి బూడిదయ్యాయి. థియేటర్పైనున్న సెల్ టవర్లు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. గాజువాక, పారిశ్రామిక ప్రాంత పరిధిలోని పెదగంట్యాడ, గాజువాక ఆటోనగర్ అగ్నిమాపక శకటాలతోపాటు, హెచ్‌పీసీఎల్, షిప్‌యార్డు, కోరమాండల్, స్టీల్‌ప్లాంట్ తదితర పరిశ్రమలకు చెందిన అగ్నిమాపక శకటాలతో రెండు గంటలపాటు శ్రమించి మంటలను విస్తరించకుండా నిలువరించారు. ఘటనలో సుమారు మూడు కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు థియేటర్ మేనేజర్ పోలీసులకు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే డీసీపీ ఫకీరప్ప, సౌత్ ఇన్చార్జి ఏసీపీ రంగరాజు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
విశాఖ శ్రీకన్య ధియేటర్లో అగ్నిప్రమాదం
-
శ్రీకన్య థియేటర్‌పై దాడి
తాటిచెట్లపాలెం(విశాఖ): కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రైల్వేన్యూకాలనీ శ్రీకన్య థియేటర్‌పై దాడిచేసి అద్దాలను ధ్వంసం చేశారు. గురువారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఈ సంఘటన జరిగినట్టు థియేటర్ మేనేజర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. పదిహేను రోజులక్రితం తాము ఈ సినిమా ప్రదర్శన చేపడదామనుకుని తొలుత అనుకున్నా నాలుగురోజుల క్రితమే నిర్ణయాన్ని వెనక్కుతీసుకుని చిత్రప్రదర్శన నిలిపివేస్తున్నట్టు ప్రకటించమన్నారు. నాలుగు ఆటోల్లో దాదాపు 15మంది దుండగులు వచ్చి థియేటర్‌పై మూడు వైపులనుంచి రాళ్లవర్షం కురిపించి అద్దాలను ధ్వంసం చేశారని తెలిపారు. థియేటర్ల వద్ద గట్టి బందోబస్తు బాహుబలి ఆడుతున్న థియేటర్ల వద్ద వి ధ్వంసకర పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుం టున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్ వెల్లడించారు. గురువారం కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 50రూపాయిలకు పైబడిన టికెట్లను ఆన్లైన్లోనే అమ్మాలని థియేటర్ల యజమానులకు సూచించామన్నారు. థి యేటర్ల యజమానులతో చర్చించామన్నారు. 20,30, 40 రూపాయిల టికెట్లను థియేటర్లలోనే అమ్ముతారని జేసీ తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
విశాఖలో బాహుబలి అభిమానుల హల్చల్
విశాఖపట్నం: 'బాహుబలి' అభిమానులు గురువారం విశాఖపట్నంలో హల్చల్ సృష్టించారు. స్థానిక శ్రీకన్య థియేటర్లో బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించడం లేదని ఆ చిత్ర అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులోభాగంగా సదరు అభిమానులు ఈ రోజు ఉదయం శ్రీకన్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. శుక్రవారం బాహుబలి చిత్రాన్ని శ్రీకన్య థియేటర్లో చిత్రాన్ని ప్రదర్శించే విధంగా సన్నాహాలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో శ్రీకన్య థియేటర్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో థియేటర్ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాహుబలి అభిమానుల దాడి ఘటనపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి చిత్రం మొదటి భాగం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.