నాణ్యతకు, రుచికి ప్రియ గోల్డ్ ఆయిల్స్
హైదరాబాద్ : సంతోషానికి మూలం ఆరోగ్యకరమైన ఆహారమేనని ప్రియ గోల్డ్ ఆయిల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యున్నత నాణ్యత, రుచులను అందించడం లక్ష్యంగా గత 15 ఏళ్లుగా ప్రియ గోల్డ్ ఆయిల్స్‌ను అందిస్తున్నామని సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్ బుక్కా, చంద్రశేఖర్ బుక్కాలు పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, వినియోగదారుల అభిరుచుల ప్రకారం, వంట నూనెలను అందిస్తున్నామని, లక్షల టర్నోవర్‌కు చేరామని వివరించారు.
ఇక మంచి ఆరోగ్యం కోసం మంచి ఔషధాలు అవసరమని అందుకే ఫార్మా రంగంలోకి ప్రవేశించామని తెలిపారు. ఈ రంగంలో అపార అనుభవమున్న అరుణ్ కుమార్ బిజ్జల నేతృత్వంలో కన్వర్జ్ బయోటెక్‌ను ప్రారంభించామని తెలిపారు. నాణ్యత గల చౌక జనరిక్ ఔషధాలను వినియోగదారులకు అందించడం లక్ష్యంగా కన్వర్జ్ బయోటెక్‌ను ఆరంభించామని పేర్కొన్నారు.