రాష్ట్రంలో కరువనేది ఉండదు: దేశపతి
మిషన్ కాకతీయతో భవిష్యత్ లో తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉండదని కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చెరువులను నిర్లక్ష్యం చేశారని.. ముఖ్య మంత్రి కేసీఆర్ ఆద్వర్యంలో మిషన్ కాకతీయ తో చెరువుల పునరుద్ధరణ చేపట్టామని వివరించారు. ఖమ్మం జిల్లా బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువను ఆయన ఆదివారం 32 మంది రచయిత, కవులు బృందంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడికి వెళ్లినా భూమికి నీటి వసతి కల్పించండి చాలు అనే డిమాండ్ వినిపించేదని... మిషన్ కాకతీయతో చెరువులు జలకళను సంతరించుకున్నాయన్నారు. నదీజలాలతో చెరువులని అనుసంధానం చేస్తే.. తెలంగాణ రాష్ట్రంలో కరువు అనేది ఉండదని అభిప్రాయపడ్డారు.