బొత్స‘చిరు’ కన్ను!
చీపురుపల్లి, న్యూస్‌లైన్ :పట్టణంలో చేపట్టిన రోడ్ల విస్తరణలో భాగంగా వందలాది మంది చిరు వ్యాపారులు దుకాణాలు కో ల్పోయి, వీధిన పడ్డారు. వారిని ఆదుకోవాల్సిన పాల కులు, అధికారులు ఏమీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ విషయమై ఇప్పటివరకు స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో దేవాదాయ శాఖ స్థలంలో రామచంద్రసాహు కర్రల మిల్లు వద్ద నిర్మించిన దుకాణాల వివాదంలో కూడా మంత్రి కలుగజేసుకోకపోవడంతో ఆ విషయం కో ర్టుకు వెళ్లింది. దీంతో అక్కడ దాదాపు 50 దుకాణాలకు చెందిన చిరు వ్యాపారులు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నారు.
ఆ తరువాత ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి శ్రీనివాసామహల్ జంక్షన్ వరకు నిర్మించిన దుకాణాల విషయంలో కూడా మంత్రి బొత్స చొరవ చూపించి వ్యాపారులకు అనుకూలంగా ప్రభుత్వపరంగా ఏమైనా హక్కు లు కల్పించి ఉంటే నేడు దుకాణాలు తొలగించే పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఇక్కడ ఉంటున్న 150 మంది చిరువ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరగా వ్యాపారాలు లేక, అప్పులు చేసి నిర్మించిన దుకాణాలు తొల గించే పరిస్థితి వచ్చినప్పటికీ మంత్రి కనీసం పట్టించుకోవ డం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆయన తలచుకుంటే చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఏమైనా చేయగలరని, కాని ఎందుకనో వారి కి జరుగుతున్న నష్టానికి సంబంధించి పట్టించుకోవడం లేదన్న వాదనలు ఉన్నారుు. నియోజకవర్గంలోని ప్రతి అంశంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించే మంత్రి వ్యాపారుల జీవితాలను నిలబెట్టేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అర్థం కావడం లేదని పార్టీలోని స్థానిక నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ తెలిసి కూడా ప్రణాళికాబద్ధంగా చిరు వ్యాపారులకు పూర్తి హక్కులతో కూడిన దుకాణాలను అప్పగించాలన్న ఆ లోచన మంత్రి ఎందుకు చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తమ్మీద ఈ వ్యవహారమంతా స్థానిక నేతలపై ఉంచి, మనకెందుకు లే అన్న చందం గా మంత్రి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.