'గడికోట' జోక్యంతో సాఫీగా పట్టాల పంపిణీ
వైఎస్సార్ కడప: చినమాండ్య మండలంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముంపు బాధితులకు ఇళ్ల పట్టాలు అందేలా చూశారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ బాధితులకు పట్టాలను ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అధికారులు ఏర్పాటుచేసిన వేదికలో కాకుండా మరో చోట పట్టాల పంపిణీ చేయాలని భీష్మించారు.
బాధితులను వదిలేసి తమ అనునూయులకే పట్టాలు ఇవ్వాలని అడ్డుతగిలారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పోలీసుల సాయంతో పరిస్ధితిని చక్కదిద్దారు. దీంతో పట్టాల పంపిణీ కార్యక్రమం సజావుగా ముగిసింది.