Sripada Yellampalli project
-
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
-
‘డబుల్ బెడ్రూం’ స్థలాలు గుర్తించండి
‘ఇందిరమ్మ’ బిల్లుల కోసం విచారణ బృందాలు మిడ్‌మానేరు నిర్వాసితులకు 4723 ఇళ్ల మంజూరు గృహ నిర్మాణంపై ఇన్చార్జి కలెక్టర్ పౌసమీబసు సమీక్ష ముకరంపుర : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రెండు పడక గదుల నిర్మాణాల కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ ఖాళీస్థలాల వివరాలు శనివారంలోగా సమర్పించాలని ఇన్చార్జి కలెక్టర్ జేసీ పౌసమీబసు సమీక్షించారు. శుక్రవారం కలెక్టరేట్లో గృహనిర్మాణాలపై హౌసింగ్ పీడీ పి.నరసింహారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో సమీక్షించారు. ప్రగతిలో ఉన్న 2437 ఇళ్లకుగాను 1376 ఇళ్లు పర్యవేక్షించిన నివేదికలు అందాయని, మిగిలిన ఇళ్లను రెండు రోజుల్లోగా పర్యవేక్షించి నివేదిక ఇవ్వాలని కోరారు. ఇళ్ల లబ్ధిదారుల జాబితా ప్రకారం నియోజకవర్గానికి ఆర్డీవో, తహశీల్దార్లతో కూడిన ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టాలని, పరిశీలన పూర్తయిన అనంతరం లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులుంటాయని అన్నారు. జిల్లాలో ఇంకా మిగిలిన 44,789 మంది ఇళ్ల లబ్ధిదారుల రేషన్ కార్డుల వివరాలు ఈ నెల 31వతేదీలోగా సేకరించి పూర్తిచేయూలన్నారు. మంజూరైన 21,7827 ఇళ్లకుగాను 17,5927 మంది లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్‌కార్డుల వివరాలు ఆన్లైన్లో అనుసంధానం చేసినట్లు చెప్పారు. మిగిలిన 41,900 మందివి ఈనెల 31లోగా పూర్తి చేయాలన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్ట్ నిర్వాసితులకు జీవో నంబర్ 42 ద్వారా 4723 గృహాలు నూతనంగా మంజూరు చేయడం జరిగిందని, ఇందుకు సంబందించిన లబ్ధిదారులు పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి వర్షాకాలానికి ముందే పనులు మొదలు పెట్టాలన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులకు రామగుండం మండలానికి సంబంధించి 816, వెల్గటూర్ మండలానికి సంబంధించి 256 గృహాల పనులు ఇప్పటివరకు ప్రారంభించకపోవడానికి గల కారణాలేంటో సంబంధిత ఆర్డీవోలను సంప్రదించి నివేదికలివ్వాలని ఆదేశించారు. -
నాణ్యతకు నీళ్లు
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్: శ్రీపాద(ఎల్లంపల్లి) ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపిస్తోంది. తెలంగాణ ప్రక్రియ వేగవంతం కావడం, సీఎం కిరణ్ త్వరలో ప్రాజెక్టు ను ప్రారంభిస్తారనే ప్రచారం జరగడంతో పను లు వేగవంతం చేసిన అధికారులు నాణ్యతా ప్రమాణాలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రాజెక్టుపై నిర్మించిన రోడ్డు బ్రిడ్జి అప్పుడే పగుళ్లు చూపింది. బ్రిడ్జికి ఇరువైపుల నిర్మించిన రెయిలింగ్ సిమెంట్రాలి ఇనుపరాడ్లు బయటకు కనిపిస్తున్నాయి. రెయిలింగ్ కూలే పరిస్థితి నెలకొంది. ఇక బ్రిడ్జి నిర్మాణ పనుల్లో కాంట్రాక్టరు నాణ్యతా పాటించకపోవడంతో కింది భాగంలోని స్లాబు పగుళ్లు తేలింది. అందు లో నుంచి నీరు కారుతోంది. ప్రాజెక్టు ను తొందరగా ప్రారంభించడం కోసం పనులు వేగవంతం చేయడం వల్లనే బ్రిడ్జి, సైడ్‌వాల్ పనులను కాంట్రాక్టర్ నాణ్యతా లేకుండా చేపట్టడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు సిమెంటు పనుల తరువాత బ్రిడ్జికి, రెయిలింగ్‌కు సరిపడా నీటిని పట్టించలేదు. దీంతో గట్టిదనం కోల్పోయిన బ్రిడ్జి, రెయిలింగ్‌కు ఉన్న సిమెంటు ఊడుతోంది. వైఎస్సార్ మరణానంతరం నిర్లక్ష్యం మంచిర్యాల మండలం గుడిపేట వద్ద గల గోదావరిపై నిర్మిస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్టును తొమ్మిదేళ్ల క్రితం సుమారు రూ. 2,744 కోట్ల వ్యయంతో 21 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మాణాన్ని చేపట్టారు. అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ప్రాంతంలోని 2 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీటిని, జిల్లా ప్రజల తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ఈ ప్రాజెక్టును 2004 జూలై 28న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. కాని ఆయన మరణాంతరం నిధుల విడుదలలో పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు పనులు మూడేళ్లలో పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావడం, త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో, తన హయాంలోనే ప్రాజెక్టును ప్రారంభించాలని సీఎం ఉవ్విల్లూరుతున్నారు. 15 రోజుల్లో 15 గేట్ల బిగింపు సీఎంతో గత నెల 25న ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అప్పటికి 47 గేట్లు బిగించిన అధికారులు కేవలం 15 రోజుల్లో మిగిలిన 15 గేట్లు బిగించారు. అయినప్పటికీ ప్రాజెక్టు పనులు పూర్తికాకపోవడంతో అదే నెల 31వ తేదీకి ప్రారంభోత్సవాన్ని మార్చారు. దీంతో ప్రాజెక్టుపై బ్రిడ్జి నిర్మాణ పనులు 50వ గేటు వరకు పూర్తి కాగా 5 రోజుల్లో 62 గేట్లు బిగించి ఇరువైపులా రాకపోకలు సాగించేలా రోడ్డును పూర్తిచేశారు. ప్రారంభోత్సవానికి అవసరమైన పైలాన్ పనులు పూర్తికాకపోవడంతో జనవరి 5కు తేదీకి మార్చారు. ఇంతలో మంత్రి శ్రీధర్‌బాబు శాఖ మార్పుపై కరీంనగర్ జిల్లాలో ఆందోళనలు చేపట్టడం, తెలంగాణ బిల్లుపై చర్చ జరగకుండా సీఎం అడ్డుకోవడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణిం చుకోలేక పోయారు. తాను ప్రారంభోత్సవానికి వస్తే శ్రీధర్‌బాబు మద్దతుదారులు, తెలంగాణవాదులు, ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన నిర్వాసితుల నుంచి ప్రతిఘటన తప్పదని గ్రహించిన సీఎం మరోసారి ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. 11న ప్రారంభోత్సవానికి సన్నాహాలు ప్రస్తుతం ఈ నెల 11వ తేదీన కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్డు బ్రిడ్జి రెయిలింగ్ పనులతోపాటు, గేట్లను ఎత్తేందుకు హైడ్రాలిక్ జాకీలను ఏర్పాటు చేస్తున్నారు. పైలాన్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ. వేల కోట్లతో ప్రాజెక్టును నిర్మిస్తున్న ప్రభుత్వం సీఎంతో ప్రారంభించడానికి తేదీలు ఖరారు చూస్తూ.. వాయిదా వేస్తూ అధికారులను హడావుడికి గురిచేస్తోంది. దీంతో కాంట్రాక్టర్లు త్వరగా పనులు కావాలని నాణ్యతా ప్రమాణాలు పాటించకుండానే పనులు చేస్తున్నారు. పనులు వేగంగా చేసేందుకు అధిక సంఖ్యలో కూలీలను పెంచడం, పనులను పరిశీలించక పోవడంతో పనుల్లో నాణ్యత లోపిస్తుంది. గతంలో ప్రాజెక్టు పనులను నెమ్మదిగా చేసిన కాంట్రాక్టరు, మరో నాలుగు నెలల్లో చేయాల్సిన పనులను కేవలం 20 రోజుల్లోనే చేపట్టడంతో, కాంక్రీటు పనులు చేపట్టిన తరువాత నీటిని సరిగా పట్టించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోనే కాంక్రీటుతో చేసిన పనుల్లో సిమెంటు రాలిపోయి, పగుల్లు తేలి అందులోని రాడ్లు కన్పిస్తున్నాయి. ఇప్పటికైన సీఎం ప్రారంభోత్సవ ఏర్పాట్ల నుంచి కాస్త ప్రాజెక్టు పనుల వైపు మరలించి, పర్యవేక్షణ చేపట్టకపోతే పదికాలాల పాటు ఉండాల్సిన ప్రాజెక్టు, కొద్ది రోజులకే కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. -
పునరావాసం కార్యక్రమాల్లో జాప్యంపై అసంతృప్తి : కలెక్టర్ అహ్మద్ బాబు
ఎల్లంపల్లి(శ్రీపాదసాగర్) ప్రాజెక్టు నిర్వాసితులకు రెండ్రోజుల్లో పరిహారం అందించాలని కలెక్టర్ అహ్మద్ బాబు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రాజెక్టు ముంపు బాధితుల పునరావాసం కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడిపేట, నంనూర్, రాంపల్లి, కొండపల్లి గ్రామాల్లో 1,719 మంది బాధితులకు పునరావాసం డబ్బులు మంజూరు చేయాలని 20 రోజుల క్రితం చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్అండ్ఆర్ ఇంజినీర్, ప్రిన్సిపాల్ సెక్రెటరీలతో మాట్లాడి రూ.35 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. 20 రోజులు గడుస్తున్నా సమాచారం అందించలేదని పునరావాస కార్యక్రమాల అధికారి ఎస్.తిరుపతిరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాసం కల్పించాలని ఆదేశిస్తే డబ్బులు విడుదల కాలేదని చెబుతారు, డబ్బులు విడుదలైతే విచారణ, తదితర కారణాలు చూపుతారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. 300 మందికి పరిహారం అం దించేందుకు సిద్ధం చేసినట్లు తిరుపతిరావు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి 65 గేట్లకు గాను 45 గేట్లు పూర్తయ్యాయని, మిగతా వాటి నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని కలెక్టర్ చెప్పారు. అక్టోబర్‌లో ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముంపు గ్రామాల బాధితులను తక్షణమే ఖాళీ చేయించాలని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ సుజాతశర్మ, ఏజేసీ వెంకటయ్య, డీఆర్వో ఎస్ఎస్ రాజు, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, గజ్జన్న, నర్సింగ్‌రావు, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎస్ఈ వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌కో ఎస్ఈ అశోక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇంద్రసేన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఓటరు నమోదు దరఖాస్తులు పరిశీలించాలి కలెక్టరేట్ : ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది, ఇవీఎంల పరిశీలన వంటి కార్యక్రమాలను పరిశీలించాలని సూచించారు. కలెక్టర్ అహ్మద్ బాబు మాట్లాడుతూ ఫారం 6, 7, 8, 8ఏ ద్వారా అందిన దరఖాస్తులను పరిష్కరిం చామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన 85 శాతం పూర్తి చేశామని, జిల్లాలో బీఎస్ఎన్ఎల్ సహకారంతో విల్ఫోన్లతో పోలింగ్ కేంద్రా ల కనెక్టివిటీ చేయడం జరిగిందని చెప్పారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాల నుంచి కనెక్టివిటీ చేశామని పేర్కొన్నారు. జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఎస్డీసీ, కేఆర్సీ ఎస్డీసీ, ఉట్నూర్ ఆర్డీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ సుజాతశర్మ, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఆర్వో ఎస్ఎస్ రాజు, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, గజ్జన్న తదితరులు పాల్గొన్నారు.