ఆశాజనకంగా ఎస్సారెస్పీ నీటి మట్టం
బాల్కొండ : శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం ఆశాజనకంగా ఉంది. ప్రాజెక్ట్‌లో శనివారం మధ్యాహ్నం వరకు 36.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుత సంవత్సరం ప్రాజెక్ట్‌లోకి ఇప్పటి వరకు 32 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్ట్‌కు జలకళ సంతరించుకుంది. గతేడాది ఇదే రోజు ప్రాజెక్ట్‌లో 1051.70 అడుగుల(7.24 టీఎంసీలు) నీరు మాత్రమే నిల్వ ఉంది. కానీ ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. అలాగే మహారాష్ట్రలోని విష్ణుపూరి ప్రాజెక్టు నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. విష్ణుపురి నుంచి ఇక్కడకు నీరు చేరాలంటే 36 గంటల వ్యవధి పడుతుందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఆదివారం ప్రాజెక్టులోకి Ð