వైద్యానికి ఆర్థిక సాయం చేయండి
⇒ ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్ యువతి లేఖ
⇒ జన్యుపరమైన లోపంతో బాధపడుతున్న శ్రీరమ్య
సాక్షి, న్యూఢిల్లీ: జన్యుపరమైన లోపం తో బాధపడుతున్న తనకు వైద్య చికి త్సల నిమిత్తం ఆర్థిక సాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని హైదరాబాద్కు చెందిన శ్రీరమ్య కోరారు. మంగళవారం ఈ మేరకు ప్రధానికి ఆమె లేఖ రాశారు. నగరంలోని హస్తి నాపురానికి చెందిన శ్రీనివాసరావు, విజయ దంపతుల కుమార్తె రమ్య, ఇగ్నోలో దూరవిద్యలో డిగ్రీ చదువుతోం ది. జన్యు లోపాల కారణంగా వయసు పెరిగేకొద్దీ ఆమెలో శరీరం ఎదుగుదల ఆగిపోయింది. మారోటియాక్స్ అనే జన్యుపరమైన వ్యాధితో రమ్య బాధపడుతున్నట్లు వైద్యు లు గుర్తించారు. చికిత్సను దీర్ఘకాలం పాటు చేయించుకోవాలి. అది కూడా రూ.కోటి వరకు ఖర్చుతో కూడుకున్నవి.
త్వరగా చికిత్స చేయించుకోకుంటే శరీరంలో మిగతా అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారని ఆమె తెలిపారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన తనకు వెద్య ఖర్చులు భరించే స్తోమత లేదని, తనపై దయ ఉంచి వైద్యానికి సాయం చేయాలని ప్రధానిని అభ్యర్థించారు. ప్రపంచ 8వ అరుదైన వ్యాధుల దినం సందర్భంగా ఢిల్లీలో జన్యుపరమైన వ్యాధులతో బాధపడే వారి సహాయార్థం ఏర్పాటైన కార్యక్రమంలో రమ్య పాల్గొన్నారు. ఆమె వైద్యానికి ఆర్థికసాయం కోరుతూ కేంద్రాన్ని సంప్రదిస్తామని, సహకారం అందిస్తామని సంఘం అధ్యక్షుడు మజిత్ సింగ్ తెలిపారు.