ఆకట్టుకున్న ఫల పుష్ప ప్రదర్శన
తిరుమల(తిరుచానూరు) :
శ్రీవారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ ఏడాది ప్రదర్శనలో పలు ఆధ్యాత్మిక ఘట్టాలతో అమోఘమనిపించారు. 18రకాల పుష్పాలు, కూరగాయలు, మైథలాజికల్ స్ట్రక్చర్స్తో కృత, త్రేత, ద్వాపర, కలియుగం, రామాయణం, మహాభారతం, భాగవతం, దశావతరాల్లోని పలు ఘట్టాలు భక్తులను అబ్బురపరుస్తున్నాయి. కొందరు భక్తులు వీటిని తమ సెల్ఫోన్లో బందించేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం కనబరిచారు.