జర్నలిస్ట్ టు ఎయిర్ హోస్టెస్!
శ్రియను చూస్తే కొంతమంది అమ్మాయిలకు అసూయగా, అబ్బాయిలకు హ్యాపీగా ఉందట. ఎందుకంటే... ఇప్పుడామె వయసెంత? అల్మోస్ట్ 35 ఇయర్స్. శ్రియను చూస్తే అలా కనిపిస్తారా? పాతికేళ్ల అమ్మాయిలా ఉంటారు కదూ! అందుకే, అమ్మాయిలు అసూయ పడుతున్నారట! ఇప్పుడామె నటిస్తున్న సినిమా విడుదలైనప్పుడు ఆ అమ్మాయిలంతా మరింత అసూయ పడతారేమో? ఎందుకంటే... అందులో అల్ట్రా మోడ్రన్ ఎయిర్ హోస్టెస్‌గా నటిస్తున్నారీమె. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు హీరోలుగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘వీరభోగ వసంతరాయులు’.
ఇందులోనే శ్రియ ఎయిర్ హోస్టెస్‌గా కనిపించనున్నారు. రీసెంట్గా రిలీజైన ‘పైసా వసూల్’లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా మెప్పించారు శ్రియ. ఇప్పుడా పాత్ర నుంచి బయటకొచ్చేశారు. జర్నలిస్ట్ టు ఎయిర్ హోస్టెస్‌గా మారారు. ప్రస్తుతం ‘వీరభోగ వసంతరాయులు’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎయిర్ హోస్టెస్‌గా శ్రియ, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇంద్రసేన దర్శకత్వంలో బెల్లాన అప్పారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోలు, విలన్లు ప్రత్యేకంగా ఎవరూ లేరు. కథలో ప్రతి ఒక్కరి పాత్రకూ ప్రాముఖ్యత ఉంటుందట!