అవి లేక వాయిదా పడ్డ మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఏమ్యాచ్లైనా ఎందుకు రద్దు చేస్తారు. వాతావరణం బాగాలేకో, పిచ్ అననుకూల పరిస్థితుల్లో రద్దవటమో, వాయిదా పడటమో జరుగుతుంది. అంతులోను ఫుట్బాల్ మ్యాచ్లు రద్దు చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఆఫ్రికాలోని కేప్ వెర్డేన్లో జరగాల్సిన ఓ పుట్బాల్ బ్యాచ్ ఆశ్చర్యకరంగా రద్దైంది. స్టేడియం అధికారులు చేసిన నిర్లక్ష్యానికి మ్యాచ్ను వాయిదా వేశారు. స్టేడియం అధికారులు స్టేడియం గేటు తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోయారు. దీంతో మ్యాచ్ను వాయిదా వేయాల్సి వచ్చింది
వివరాల్లోకి వెళ్తే కేప్ వెర్డేన్లో ఫుట్బాల్ ఛాంపియన్షిప్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆల్ట్రామెరీనా, మిండ్లెన్స్ జట్ల మధ్య తొలి సెమీస్ మ్యాచ్ జరగాల్సిఉంది. కానీ స్టేడియం అధికారులు స్టేడియం గేటు తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోయారు. దీంతో మ్యాచ్ వాయిదా పడింది. అంతేకాదు ఆదేశ ఫుట్బాల్ అసోషియేషన్ రెండో సెమీస్ మ్యాచ్ను ఆడాలని జట్లను ఆదేశించింది. తొలి మ్యాచ్ ఫలితం తేలకుండా రెండో మ్యాచ్ నిర్వహించడం కొత్తగనే ఉంది కదా!. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అట్లాంటిక్ మహా సముద్రంలోని పది చిన్న చిన్న ద్వీపాల సముదాయమే ఈ కేప్వెర్డేన్ దేశం.