'మౌనం వీడే వరకు మేమింతే'
న్యూఢిల్లీ: ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. దాదాపు భారీ సంఖ్యలో. అంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే.. ఒక్కసారిగా నినాదాలు, చేతిలో ప్లకార్డులు, నిరసన హోరులు.. ఇదంతా కూడా బుధవారం పార్లమెంటు వద్ద తాజా దృశ్యం. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో లలిత్ మోదీ వ్యవహారాన్ని చేతిలో ఆయుధంగా పెట్టుకొని అధికార పక్షాన్ని ఇరుకున పెడుతుంటే బయటకూడా అలాంటి కాకనే కాంగ్రస్ పార్టీ తన యువజన విభాగం ద్వారా సృష్టించింది.
లలిత్ మోదీకి వీసా ఇచ్చేందుకు సహకరించిన సుష్మా స్వరాజ్‌ను, ఆమెతోపాటు ఉన్న ఇతర నిందితులు ముఖ్యమంత్రులు వసుంధర రాజే, వ్యాపం స్కాంకు సంబంధించి శివరాజ్ సింగ్ చౌహన్‌ను వెంటనే తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం డిమాండ్ చేసింది. ప్రధాని వెంటనే మౌనం వీడి సమాధానం చెప్పాలని, ఆయన చెప్పేవరకు పార్లమెంటు ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు.