తమిళనాడులో జల్లికట్టు ఆందోళనలు
తక్షణ ఆర్డినెన్స్‌కు స్టాలిన్ డిమాండ్
సాక్షి ప్రతినిధి, చెన్నై: జల్లికట్టుపై నిషేధాన్ని ఉల్లంఘిస్తూ మదురై సమీపంలోని ఓ గ్రామంలో శుక్రవారం జల్లికట్టు నిర్వహించారు. జల్టికట్టు కోసం చేస్తున్న నిరసన ప్రదర్శనల్లో భాగంగా కొందరు యువకులు ఐదు ఎద్దుల్ని మైదానంలోకి వదిలారని స్థానిక పోలీసులు చెప్పారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలంటూ చెన్నైలో జరిగిన ఆందోళనలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానిపై స్టాలిన్ ధ్వజమెత్తింది. సినీ నటులు, ఇతరులను కలిసేందుకు ఆయనకు సమయం ఉంటుంది కానీ ఏఐఏడీఎంకే ఎంపీలకు మాత్రం సమయం కేటాయించలేదని స్టాలిన్ విమర్శించారు. జల్లికట్టు నిర్వహణకు వీలుగా కేంద్రం ఆర్డినెన్సు జారీ చేయాలని డిమాండ్ చేశారు.