నక్షత్ర వాటికను ప్రారంభించిన రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో నక్షత్ర వాటిక ఉద్యానవనాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం అందులోని మొక్కలను పరిశీలించారు. వాటికి సంబంధించిన విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్రపతి భవన్ అధికారులు పాల్గొన్నారు.
నక్షత్ర వాటిక సమీపంలో ఉన్న శివాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రికెటర్ అజారుద్దీన్, మంత్రి ఇంద్రకిరణ్రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, పలువురు ప్రముఖులు రాష్ట్రపతిని కలిశారు.