ఆటోలోనూ నగదు రహిత ప్రయాణం
ఏలూరు (మెట్రో) : జిల్లాలో నగదురహిత ఆటో ప్రయాణానికి రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ శ్రీకారం చుట్టారు. రవా ణాశాఖ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఆటోల్లో ప్రయాణించే వారు నగదుతో సంబంధం లేకుండా ప్రత్యేక యాప్ ద్వారా ఆటో చార్జీలు చెల్లించే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. మంత్రి పితాని సత్యనారాయణతో పాటు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఏలూరు మేయర్ నూర్జహా న్ కొద్దిదూరం ఆటోలో ప్రయాణించారు. ఆటో చార్జీల కోసం చిల్లర సమస్య తలెత్తకుండా నేరుగా ఆటో డ్రైవర్ బ్యాంకు ఖాతాకు సొమ్ము జమయ్యేలా రూపొందించిన ఈ ప్రత్యేక యాప్ వల్ల ఎక్కడా నగదు సమస్య తలెత్తబోదని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. రాబోయే రోజుల్లో నగదు రహిత లావాదేవీలకు ప్రజలు అలవాటు పడతారని, రాబోయే రెండేళ్లలో ఈ విధానానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని మంత్రి పితాని చెప్పారు. ఆటో డ్రైవర్ ఖాతాకు కలెక్టర్ కాటంనేని భాస్కర్ బ్యాంకు ఖాతా నుంచి రూ.50 సొమ్మును ఆ న్లై న్లో పంపించారు. దశల వారీగా ఆటో సేవలను విస్తరించనున్నారు.