తొలి బీసీ ప్రధాని మోడీ: బీసీ సంఘాల హర్షం
హైదరాబాద్: ఎన్డీఏ కూటమి తరఫున దేశ తొలి బీసీ ప్రధానిగా నరేంద్రమోడీని ఎంపిక చేస్తూ భారతీయ జనతా పార్లమెంటరీ పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా తొలిసారి ప్రధాని పదవిని అధిష్టిస్తున్న నరేంద్రమోడీకి బీసీలందరి తరుపున అభినందనలు తెలియజేస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎల్బీ నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ ప్రజా సమితి అధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగె మల్లేశ్ యాదవ్, బీసీ సేన అధ్యక్షుడు ఎ. పాండు ఒక ప్రకటనలో తెలిపారు.