ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి: జగదీష్‌రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో సింహ భాగం సంక్షేమ రంగానికే కేటాయించామని, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన ప్రతి పైసా వారి అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై స్వల్పకాలిక చర్చను మంత్రి ప్రారంభించారు. నిరుపేద దళితులకు మూడెకరాలు పంపిణీ చేశామని, 3,671 మంది దళితులకు వ్యవసాయ యోగ్యమైన భూమిని పంపిణీ చేశామని తెలిపారు. ఈ భూముల్లో బోర్లు వేయించి పంటకు పెట్టుబడి అందించామన్నారు.