ప్రతిష్టాత్మకంగా రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
నెల్లూరు(బృందావనం): నెల్లూరులో అక్టోబర్ 1 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో చాంపియన్ షిప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా ఖోఖో అసోసియేషన్ నిర్ణయించింది. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణంలోని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యవర్గం రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణపై ఆదివారం సమావేశమైంది. రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీవీ రమణయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి పసుపులేటి రామమూర్తి, జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షుడు షేక్ జిలానీబాషా, ఆంధ్రప్రదేశ్ స్కూల్గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి మహబూబ్బాషా, జిల్లా ఖోఖో సంఘం కార్యదర్శి గురుప్రసాద్, కోశాధికారి ఎం గిరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు సీనియర్ ఖోఖో జట్ల ఎంపికలు పూర్తి
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా సీనియర్ పురుషుల, మహిళల ఖోఖో జట్ల ఎంపికలను ఆదివారం నిర్వహించారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభకనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. జిల్లా జట్ల ఎంపికలను జిల్లా ఖోఖో అసోసియేషన్ నిర్వాహకులు, డీఎస్డీఓ రమణయ్య, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి రామమూర్తి పర్యవేక్షించారు.