హాకీ విజేత వైఎస్ఆర్ కడప జిల్లా
- ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు
నూనెపల్లె: రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో వైఎస్ఆర్ కడప జిల్లా జట్టు విజేతగా నిలిచింది. తూర్పుగోదావరి, అనంతపురం జిల్లా జట్టు ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. హాకీ సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలో ఈ పోటీలు నిర్వహించారు. మెదటి సెమీఫైనల్లో అనంతపురంపై గెలిచిన వైఎస్ఆర్ కడప, రెండో సెమీఫైనల్లో విశాఖపట్నం జట్టుపై తూర్పుగోదావరి జట్టు ఫైనల్లో తలపడ్డాయి. ఫలితం 2–2 రావడంతో షూటౌట్ నిర్వహించగా. వైఎస్ఆర్ కడప జట్టు 5–2 తేడాతో తూర్పుగోదావరిపై విజయం సాధించింది. అనంతపురం, విశాఖపట్నం జట్టు మూడో స్థానానికి పోడీపడగా 2–1 అనంతపురం గెలుపొందింది. విజేతలకు బహుమతులు ప్రదానం చేసి.. జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు బి.జె. చాణిక్య రాజు మాట్లాడారు. అందరి సహకారంతో ఈ సారి నంద్యాలలో జాతీయ స్థాయి హాకీ పోటీలను నిర్వహిస్తామన్నారు. హాకీ సంఘం జిల్లా కార్యదర్శి సుధీర్ , లయన్స్క్లబ్ అ«ధ్యక్షుడు భవనాశి నాగమహేష్, నెల్లూరు హాకీ అసోసియేషన్ కార్యదర్శి ధామస్ పీటర్, వైఎస్ఆర్ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సుభాన్ బాషా, కర్నూలు హాకీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్రాజు, నంద్యాల హాకీ కార్యదర్శి స్టీఫెన్, లయన్స్క్లబ్ కార్యదర్శి రామకృష్ణుడు, ప్రముఖులు ప్రభుదాస్, జోసఫ్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.