చైనా వాణిజ్య సంస్థల ప్రతినిధుల బృందం శ్రీసిటీ పర్యటన
సత్యవేడు(చిత్తూరు జిల్లా): చైనాలోని షెజి యాంగ్ రాష్ట్రం నుంచి 10 మంది సభ్యుల వాణిజ్య సంస్థల ప్రతినిధుల బృందం శుక్రవారం శ్రీసిటీలో పర్యటించింది. హిసేహ్ చింగ్ టోంగో ఈ బృందానికి నేతృత్వం వహించారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి వారికి స్వాగతం పలికి పారిశ్రామిక పరంగా సాధించిన ప్రగతిని వివరించారు.సమావేశానంతరం బృందం సభ్యు లు శ్రీసిటీలోని పలు ప్రదేశాలలో పర్యటించి పాల్స్ ప్లష్ బొమ్మల కంపెనీని సందర్శించారు. శ్రీసిటీ లాంటి పెద్ద పారిశ్రామిక పార్కును నెల కొల్పి, సమర్ధవంతంగా నిర్వహిస్తున్నందుకు చైనా బృందం రవీంద్రసన్నారెడ్డిని అభినందించింది.