వాటర్‌గ్రిడ్ టెండర్లకు నోటిఫికేషన్
* తొలి విడతగా 11 ప్యాకేజీలకు..
* రూ. 15,987 కోట్ల విలువైన పనులకు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి పథకం (వాటర్‌గ్రిడ్) తొలిదశ పనులకు టెండర్ల నోటిఫికేషన్‌ను గ్రామీణ నీటి సరఫరా అధికారులు గురువారం విడుదల చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని 26 ప్యాకేజీలుగా విభజించగా.. తొలివిడతగా 11 ప్యాకేజీలకు టెండర్లను పిలిచారు. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,568 కోట్లు కాగా.. రూ.15,987 కోట్ల విలువైన పనులకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు.
ఈనెల 27 నుంచి ఆగస్టు 11 వరకు ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ (www. eprocurement.gov.in)లో టెండర్ డాక్యుమెంట్, రశీదు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 11న సాయంత్రం 5.15 గంట లకు టెక్నికల్ బిడ్లను, 14న ఉదయం 11.30కు ఫైనాన్షియల్ బిడ్లను తెరవనున్నారు. జిల్లాల వారీగా టెండర్ల ప్రక్రియను ఆయా జిల్లాల్లోని సూపరింటెండెంట్ ఇంజనీర్లు పర్యవేక్షించనున్నారు.