ఒంటరి జీవితం హాయిగా ఉంది
లండన్: తన కోసం, పిల్లల కోసం సమయం కేటాయించడం కోసం ఒంటరిగానే ఉండాలని భావిస్తున్నట్టు పాప్ గాయని, నటి జెన్నిఫర్ లోపెజ్ చెప్పారు. 45 ఏళ్ల లోపెజ్కు ఆమె మాజీ భర్త మార్క్ ఆంటోనీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు.
ఆంటోనీతో విడిపోయాక లోపెజ్ కొరియోగ్రాఫర్ కాస్పెర్ స్మార్ట్‌లో రెండున్నరేళ్ల పాటు డేటింగ్ చేశారు. కాగా గత జూన్‌లో లోపెజ్ స్మార్ట్‌తో బంధాన్ని తెంచుకున్నారు. మళ్లీ ప్రేమలో పడే అవకాశాన్ని తోసిపుచ్చని లోపెజ్ ఇకమీదట ప్రేమ వ్యవహారంలో జాగ్రత్తగా ఉంటానని చెప్పారు. ప్రస్తుతానికైతే ఒంటరి జీవితాన్ని ఆస్వాదిస్తున్నాని అన్నారు.