త్వరలో మరిన్ని అరెస్టులు !
హైదరాబాద్: ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు ముడుపుల వ్యవహారం కేసులోని రూ.50 లక్షలకు సంబంధించి ఏసీబీ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై ఇప్పటికే సమగ్రచారం ఏసీబీ రాబట్టినట్లు సమాచారం. రేవంత్ రెడ్డితోపాటు మిగితా ఇద్దరు నిందితులను ఏసీబీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రూ.50 లక్షలకు సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.