Sting Video
-
ఆ వీడియో నిజమైతే నన్ను అరెస్టు చేయండి.. బీజేపీకి సిసోడియా సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఆ పార్టీ విడుదల చేసిన స్టింగ్ వీడియోపై మండిపడ్డారు. ఒకవేళ ఆ వీడియో నిజమైతే నాలుగు రోజుల్లో తనను అరెస్టు చేయాలని కమలం పార్టీ నేతలకు సిసోడియా సవాల్ విసిరారు. బీజేపీ అధికార ప్రతినిధి సుదాన్షు త్రివేద్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి ఓ స్టింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు నిందితుల్లో ఒకడైన అమిత్ ఆరోరా.. కొంతమందికి ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతోనే ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని రూపొందించిందని మాట్లాడినట్లు ఉంది. అంతేకాదు లిక్కర్ పాలసీతో వచ్చిన డబ్బును గోవా, పంజాబ్‌లో ఆప్ ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసినట్లు అతను చెప్పాడు. దీన్నే ఆధారంగా చూపుతు బీజేపీ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అయితే సిసోడియా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. సీబీఐ అధికారులు తన ఇల్లు, బ్యాంకు లాకర్లో సోదాలు చేసినా ఒక్క ఆధారం కూడా లభించలేదని గుర్తు చేశారు. ఒకవేళ ఆ వీడియో నిజమైతే తనను అరెస్టు చేసినా సిద్ధమన్నారు. లేకపోతే ఆ వీడియో ఫేక్ అని బీజేపీ నేతలు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన లిక్కర్ పాలసీని ఉపసంహరించుకుంది. ప్రస్తుతం ఇది అమలులో లేదు. ఈ పాలసీలో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ, అలాంటిదేమీ లేదని ఆప్ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయు. ఈ వ్యవహారంపై సీబీఐ కూడా కేసు నమోదు చేసి విచారణ చేపడుతోంది. చదవండి: గులాం నబీ ఆజాద్‌కు ఉగ్రవాదుల బెదిరింపులు -
బలపరీక్షకు ముందే రావత్‌కు మరో షాక్!
మరో రెండు రోజుల్లో హరీశ్ రావత్ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొనుండగా.. ఆయనకు మరో గట్టి షాక్ తగిలింది. రావత్ తరఫున రెబల్ ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చానని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు అంగీకరిస్తున్నట్టు భావిస్తున్న స్టింగ్ ఆపరేషన్ వీడియో బయటపడటం కలకలం రేపుతోంది. స్థానిక న్యూస్ చానెల్ సమాచార్ ప్లస్ ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ బిష్ట్, రెబల్ ఎమ్మెల్యే హరక్ సింగ్ రావత్‌తో మాట్లాడుతూ.. పదవీచ్యుత సీఎం రావత్ తరపున డిప్యూటీ స్పీకర్ ఏపీ మైఖూరికి, 12మంది రెబల్ ఎమ్మెల్యేలకు తాను కోట్లాది రూపాయల డబ్బు లంచంగా ముట్టజెప్పినట్టు చెప్పడం ఈ వీడియోలో కనిపిస్తున్నది. కొంతమంది ఎమ్మెల్యేలకు రూ. 25 లక్షల చొప్పున ఇచ్చానని, డిప్యూటీ స్పీకర్ మైఖూరికి రూ. 50 లక్షలు రావత్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో రావత్ ప్రభుత్వం మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ 12మందిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించగా.. సుప్రీంకోర్టు పదవీచ్యుత సీఎం రావత్‌కు ఈ నెల 10న అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలకు రావత్ లంచాలు ఇవ్వజూపినట్టు ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో వెలుగుచూడగా.. తాజాగా మరో వీడియో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. -
ఉత్తరాఖండ్ సీఎంపై అవినీతి ఆరోపణలు