తాళం పడింది!
► ‘థర్మల్’ కేంద్రంలో ఆగిన ఉత్పత్తి
► ఉద్యోగ, కార్మికుల్లో ఆందోళన
► ఏకమైన కార్మిక సంఘాలు
సాక్షి, చెన్నై: ఎన్నూర్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి తాళం వేశారు. చడీ చప్పుడు కాకుండా ఆ కేంద్రాన్ని మూసి వేయడాన్ని ఉద్యోగ, కార్మికులు జీర్ణించుకోలేకున్నారు. తమకు ప్రత్యామ్నాయం కల్పించాలని ఆందోళన బాట పట్టారు. ఉత్తర చెన్నై ఎన్నూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించారు. తొలుత 60 మెగావాట్ల ఉత్పత్తితో మొదలై, క్రమంగా 450 మెగావాట్లకు సామర్థ్యన్ని పెంచారు. ఒకటి, రెండు యూనిట్ల ద్వారా తలా 60 మెగావాట్లు, మూడు, నాలుగు, ఐదు యూని ట్ల ద్వారా తలా 110 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి సాగుతూ వచ్చింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ కేవలం చెన్నై నగర, సరిహద్దులకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా 1030, పరోక్షంగా మూడు వందల మంది ఉద్యో గ కార్మికులు పనిచేస్తూ వస్తున్నారు.
ఇటీవల ఈ కేంద్రం విస్తరణ పేరుతో పక్కనే కొత్తగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అన్నాడీఎంకే సర్కారు చర్యలు తీసుకుంది. 660 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఆ కేంద్రంలో తొలి యూనిట్ ఏర్పాటుకు తగ్గ పనులకు చర్యలు చేపట్టారు. ఈ పనులు ముగియడానికి మరో రెండేళ్లు పట్టడం ఖాయం. ఈ పరిస్థితుల్లో పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రస్తుత కేంద్రంలోని యూనిట్లు తరచూ మరమ్మతులకు గురవుతూ వచ్చారుు. ఒక దాని తర్వాత మరొకటి అన్నట్టుగా నాలుగు యూనిట్లు మరమ్మత్తులకు గురయ్యారుు. అదే సమయంలో అక్కడి యూనిట్ల కాల పరిమితి 40 సంవత్సరాలు మాత్రమేనని, అంతకు మించి ఆరు సంవత్సరాలు అధికంగానే అవి పనిచేయడం వలన మరమ్మతులకు గురవుతున్నదన్నట్టుగా అధికార వర్గాలు తేల్చారు.
అలాగే, నేల బొగ్గు తరలింపు మరింత శ్రమగా మారి ఉండడంతో , అత్యాధునిక పరికరాల్ని రంగంలోకి దించి మరమ్మతులు చేరుుంచడం కష్టతరంగా అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాన్ని ఇక ముందుకు తీసుకెళ్లడం కన్నా, శాశ్వతంగా తాళం వేయడం మంచిదన్న నిర్ణయానికి ఇటీవల తమిళనాడు విద్యుత్బోర్డు వర్గాలు వచ్చారుు. ఇందుకు తగ్గ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. ఈ సమాచారంతో ఉద్యోగుల్లో ఆందోళన బయలు దేరింది. ఆ కేంద్రాన్ని రక్షించుకునేందుకు తీవ్రంగానే పోరాటా లు సాగించినా ఫలితం శూన్యం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో చడీచప్పు డు కాకుండా గురువారం ఆ కేంద్రానికి అధికారులు శాశ్వతంగా తాళం వేశారు.
దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల్లో ఆందోళన బయలు దేరింది. మొన్నటి వరకు ఒకటో యూనిట్ ద్వారా 60 మెగావాట్ల ఉత్పత్తి సాగుతూ వచ్చిం దని, ఉన్న నేలబొగ్గును అంతా ఖాళీ చేరుుంచి, హఠాత్తుగా మూసివేయడం ఎంత వరకు సమంజసమని కార్మిక సం ఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పనిలో పడ్డారుు. 46 ఏళ్లుగా సేవల్ని అందించిన ఆ కేంద్రాన్ని, పక్కనే నిర్మిస్తున్న మరో కేంద్రం కోసం మూసి వేయడం మంచి పద్ధతేనా..? అని సీఐటీయూ నేత వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చే స్తూ, పోరుబాట సాగించనున్నామన్నా రు. ఇక, గురువారం ఆ కేంద్రం వద్దకు చేరుకున్న ఉద్యోగ, కార్మికులు తాళం పడడంతో అక్కడే బైఠారుుంచి ఆందోళనకు దిగారు. ఇక, ఇక్కడి ఉద్యోగ, కార్మికులకు న్యాయం లక్ష్యంగా భారీ ఎత్తున నిరసనలు సాగించేందుకు పన్నెండు కార్మిక సంఘాలు ఏకమయ్యారుు.