కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
ముంబై: బాంద్రాలో గురువారం ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ముంబై తూర్పు బాంద్రాలోని బెహ్రాంపాడా మురికి వాడలో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.