భారత నాణేల అధ్యయన సమితి అధ్యక్షునిగా రాజారెడ్డి
హైదరాబాద్: నగరానికి చెందిన ప్రఖ్యాత న్యూరో సర్జన్, నాణేల అధ్యయన నిపుణులు డాక్టర్ దేమె రాజారెడ్డి భారత నాణేల అధ్యయన సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ నెల 13న వారణాసిలో జరిగిన సొసైటీ కార్యనిర్వాహక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్టు ప్ర ధాన కార్యదర్శి ప్రొఫెసర్ జయప్రకాశ్ సింగ్ ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ సంవత్సరాంతంలో జరిగే సొసైటీ సమావేశాలకు డాక్టర్ రాజారెడ్డి అధ్యక్షతవహిస్తారు.
న్యూరో సర్జరీ, ఫ్లోరోసిస్ వ్యాధి నివారణ కృషిలతో పాటు పురాతన నాణేల విశ్లేషణకు కూడా రాజారెడ్డి వి శేషమైన సేవలు అందించారు. నాణేల గొ ప్పతనం, చరిత్రలో వాటి ప్రాధాన్యత అంశాలపై పత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు. ఆంధ్ర జనపదానికి చెందిన దాదాపు 70 వేల నాణేలను అ ధ్యయనం చేశారు. తెలుగు ప్రాంతంలో తవ్వకాలలో బయటపడిన దాదాపు 4 లక్షల నాణేల విశ్లేషణకు మీద ప్రభుత్వం, పరిశోధకులు దృష్టిపెట్టాలని రాజారెడ్డి ఆకాంక్షిస్తున్నారు.