వైద్యం వికటించి వ్యక్తి మృతి
తిరుపతి(చిత్తూరు): వైద్యం వికటించడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. తిరుపతిలోని ఎస్టీవీ నగర్‌కు చెందిన సురేష్(32) అయాసం కారణంగా ఆస్పత్రికి వెళ్లాడు. అయితే, అక్కడ వైద్య చేసే క్రమంలో డాక్టర్లు ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ తీసుకున్న కొద్దిసేపటికి అది వికటించడంతో అతను మృతి చెందాడు. దీంతో బంధవులు ఆస్పత్రి ఎదుట గొడవకు దిగారు. దీంతో సిబ్బంది మొత్తం ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. మాకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు.