సునామీపై అప్రమత్తం కండి
మొగల్తూరు: ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని సబ్‌కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. సునామీ సంభవిస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలపై బుధవారం మండలంలోని కేపీ పాలెం సౌత్ గ్రామంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. రెవెన్యూ, పోలీస అగ్నిమాపక శాఖ, మత్స్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్, ఎన్డీఆర్ఎఫ్, వైద్యారోగ్య శాఖ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ అయిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరించారు.
అనంతరం జరిగిన సమావేశంలో సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ సునామీ బారిన పడిన 23 దేశాలు సమావేశమై సునామీ ఏర్పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏడాదికోసారి మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్నాయని చెప్పారు. అధికారులకు ప్రజలు సహకరిస్తే ప్రాణనష్టాన్ని తగ్గించుకోవచ్చున్నారు. డీఎస్పీ పూర్ణ చంద్రరావు, తహసిల్దార్ శ్రీపాద హరినాథ్, ఎంపీడీవో పి.రమాదేవి, ఎన్ఎస్ఎస్ అధికారి హరిప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ అనంతరాజు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస నాయక్, సర్పంచ్‌లు కవురు ముత్యాలరావు, మేళం రంగనాద్, ఉపసర్పంచ్ అందే తాత తదితరులు పాల్గొన్నారు.