ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు
పుట్లూరు (అనంతపురం) : స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు నీట మునిగి గల్లంతయ్యాడు. తాడిపత్రి పట్టణానికి చెందిన సయీద్(22) అనే యువకుడు ఆదివారం కావడంతో.. స్నేహితులతో కలిసి పుట్లూరులోని సుబ్బరాయసాగర్లో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో స్నేహితులంతా కలిసి ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. దీంతో అతని స్నేహితులతో పాటు స్థానికులు గాలింపుచర్యలు చేస్తున్నారు.