బెజవాడలో బోర్డు తిప్పేసిన 'శుభదర్శి'
విజయవాడ లబ్బిపేటలోని శుభదర్శి చిట్ఫండ్ కంపెనీ మంగళవారం బోర్డు తిప్పేసింది. సుమారు రూ. కోటి మేర టోకరా వేసి నిర్వహాకులు పరారైయ్యారు. దాంతో విషయం తెలుసుకున్న బాధితులు శుభదర్శి చిట్ఫండ్ కంపెనీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అనంతరం వారు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.