బుదియా సినిమా ప్రమోషన్‌కు వెళ్లాడా..?
బుదియా సింగ్.. పరుగుల వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బుడతడి పేరు కొద్ది రోజులుగా న్యూస్ హెడ్ లైన్స్‌లో ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం స్పోర్ట్స్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బుదియా.. ఇటీవల వేసవి సెలవులకు ఇంటికి వెళ్లి హాస్టల్‌కు తిరిగి రాలేదు. దీంతో బుదియా ఏం అయ్యాడు..? ఎక్కడున్నాడు...? అని కేసులు కూడా నమోదయ్యాయి.
అయితే తాజా సమచారం ప్రకారం బుదియా ఎక్కడికి పోలేదని తెలుస్తోంది. బుదియా జీవితం ఆదారంగా 'బుదియా సింగ్ : బోర్న్ టు రన్' అనే సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈసినిమా ప్రమోషన్లో భాగంగా బుదియాను ఆ చిత్ర నిర్మాతలు ముంబై తీసుకెళ్లారని తెలుస్తోంది. ఈ విషయంపై చిత్రయూనిట్ ప్రకటన చేయకపోయినా. బుదియా తప్పిపోలదని మాత్రం చెపుతున్నారు.
ఈ విషయం చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ చిత్రనిర్మాత శుభమిత్ర సేన్‌కు శనివారం నోటీసులు జారీ చేసింది. బుదియా కనిపించకపోవటంపై మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని తెలిపింది. అంతేకాదు సిటీ పోలీసులను బుదియా కనిపించకపోవటంపై కేసు నమోదు చేయాలని కోరింది.