అందరినీ ఒక్కటి చేసిన రావణదహనం
విజయదశమి సందర్భంగా నిర్వహించే రావణ దహనం కార్యక్రమం అందరినీ ఒక్కటి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ఇలా పలు పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులంతా ఒక్క వేదికపై చాలా కాలం తర్వాత కనిపించారు. అలాగే, హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా అన్ని వర్గాలకు చెందినవారు కూడా ఈ ఉత్సవానికి హాజరయ్యారు. విజయదశమి సందర్భంగా ప్రతి యేటా సుభాష్ మైదాన్‌లో భారీ ఎత్తున రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. దాంతో ఆయనతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీ తదితరులు కూడా వచ్చారు. ఉత్తరాది రాష్ట్రాల్లో విజయదశమి రోజున రావణ దహనం కార్యక్రమం నిర్వహించడం పరిపాటి.