sudigaadu
-
అందుకే ఆలస్యమౌతోంది
తమిళ సినిమాల మీద సెటైరికల్‌గా వచ్చిన పేరడీ చిత్రం ‘తమిళ పడం’. శివ హీరోగా సి.యస్ ఆముదన్ రూపొందించారు. తెలుగులో ‘సుడిగాడు’గా ‘అల్లరి’ నరేశ్ రీమేక్ చేశారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ‘తమిళ పడం 2.0’ రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మొదట మే 25న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ లేట్ అవ్వడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. సినిమా ఆలస్యం గురించి చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘తమిళ పడం 2.0’లో భారీ గ్రాఫిక్స్ వర్క్ పని ఉంది. ముఖ్యంగా మా హీరోని కొంచెం అందంగా చూపించడానికి, హీరో కండలు ఇంకా బాగా చూపించడానికి లాస్ ఏంజెల్స్‌లో స్టూడియోతో, హీరోయిన్ ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు తీసేయడానికి కాలిఫోర్నియాలో మరో స్టూడియోతో కలసి పని చేస్తున్నాం. ఇంతటి వీయఫ్‌ఎక్స్ పనిఉండటంతో రిలీజ్‌ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. భయపడకండి త్వరలోనే థియేటర్స్‌లోకి వచ్చేస్తాం’’ అని పేర్కొంది. -
సుడిగాడుకు సీక్వల్ చేస్తున్నారు
ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్, చాలా రోజులుగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమాలన్ని బాక్సీఫీస్ ముందు బోల్తా కొడుతుండటంతో రాబోయే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమా షూటింగ్లో పాల్గొంటున్న నరేష్, అనీష్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచిన సుడిగాడు సినిమాకు సీక్వల్‌ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు నరేష్. ఇప్పటికే దర్శకుడు భీమినేని శ్రీనివాస్ ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశాడు. తమిళ సినిమా తమిళ పడంకు రీమేక్‌గా రూపొందిన సుడిగాడు నరేష్ కెరీర్లోనే అత్యథిక వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ఆ సినిమా తరువాత నరేష్ నుంచి ఒక్క సూపర్ హిట్ కూడా రాలేదు. దీంతో మరోసారి అదే ఫార్ములాతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్లాన్‌లో ఉన్నాడు అల్లరోడు. -
పార్వతీపురంలో సూదిగాడి కలకలం
పార్వతీపురం: విజయనగరం జిల్లాలో సూదిగాడు కలకలం సృష్టించాడు. పార్వతీపురంలో బుధవారం గుర్తు తెలియని దుండగుడు ఓ బాలికను సూదితో గుచ్చి పారిపోయాడు. పట్టణంలోని జగన్నాథపురం ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు కుమార్తె మౌనిక(9) రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె మోచేతిపై సూదితో గుచ్చి పరారయ్యాడు. బాధితురాలు నొప్పితో బాధపడుతుండగా గమనించిన స్థానికులు విషయం తెలుసుకుని చుట్టుపక్కల గాలించినా దుండగుడి ఆచూకీ తెలియలేదు. తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఎలాంటి అపాయం లేదని వైద్యులు చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.