సుడిగాడుకు సీక్వల్ చేస్తున్నారు | Allari naresh, Bheemineni planning for sudigaadu sequel | Sakshi
Sakshi News home page

సుడిగాడుకు సీక్వల్ చేస్తున్నారు

Published Fri, Sep 23 2016 2:55 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

సుడిగాడుకు సీక్వల్ చేస్తున్నారు

సుడిగాడుకు సీక్వల్ చేస్తున్నారు

ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్, చాలా రోజులుగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమాలన్ని బాక్సీఫీస్ ముందు బోల్తా కొడుతుండటంతో రాబోయే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమా షూటింగ్లో పాల్గొంటున్న నరేష్, అనీష్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.

ఈ రెండు సినిమాల తరువాత తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్గా నిలిచిన సుడిగాడు సినిమాకు సీక్వల్ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు నరేష్. ఇప్పటికే దర్శకుడు భీమినేని శ్రీనివాస్ ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశాడు. తమిళ సినిమా తమిళ పడంకు రీమేక్గా రూపొందిన సుడిగాడు నరేష్ కెరీర్లోనే అత్యథిక వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ఆ సినిమా తరువాత నరేష్ నుంచి ఒక్క సూపర్ హిట్ కూడా రాలేదు. దీంతో మరోసారి అదే ఫార్ములాతో ఆడియన్స్ను ఆకట్టుకునే ప్లాన్లో ఉన్నాడు అల్లరోడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement