పురుగు మందు తాగి యువతి ఆత్మహత్య
పట్నంబజారు(గుంటూరు): యువతి ఆత్మహత్యకు పాల్పడడంపై కేసు నమోదైంది. అరండల్పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొంగరాలబీడుకు చెందిన కొల్లిపర శాంతి (21) గతంలో వసంతరాయపురానికి చెందిన ప్రభుదేవను ప్రేమించింది. ప్రభుదేవకు వివాహమైందని తెలుసుకున్న శాంతి పురుగుల మందు తాగగా విషయం తెలుసుకున్న ప్రభుదేవ సైతం పురుగుల మందు తాగాడు. ఈ క్రమంలో ప్రభుదేవ మతి చెందగా, శాంతి ప్రాణాలతో బయటపడింది. అప్పటి నుంచి శాంతి తల్లిదండ్రులు ప్రభుదేవ చనిపోయిన విషయం తనకు తెలియకుండా దాచిపెట్టారు. ఇటీవల విషయం తెలుసుకున్న శాంతి శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరూ లేనప్పుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.