సెల్ఫోన్ విషయమై గొడవ..యువకుడి అదృశ్యం
సెల్ ఫోన్ విషయంలో సోదరితో గొడవ.. తండ్రి మందలింపుతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థి ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవి కథనం ప్రకారం...బాగ్ అంబర్పేట సోమసుందర్నగర్లో నివాసముంటున్న దయానంద్ కుమారుడు సుహాన్(20) సికింద్రాబాద్ ఎస్పీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 6వ తేదీన ఇంట్లో సోదరి వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ విషయంలో గొడవ పడ్డాడు. గొడవ వద్దని తండ్రి మందలించడంతో మనస్థాపం చెంది ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పలు చోట్ల వెతికిన ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.