ఔరా.. అదిరింది డేరా..
కుంభమేళాలు జరిగినప్పుడు, ఇతర పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు డేరాలు వేసుకుని ఉండటం వంటివి మనకు తెలిసిందే. టెంట్లో పెద్ద సదుపాయాలేం ఉంటాయి. బ్రిటన్లోని గ్లాస్టన్బరీలో ఉన్న డేరాల్లో మాత్రం అన్ని సదుపాయాలూ ఉంటాయి. హోటళ్లలో స్టార్ హోటళ్లు ఎలా వేరో.. టెంట్లలో ఇవి అలా వేరు. వాస్తవానికి ఇదో హోటల్.. పేరు పాప్ అప్. ఇందులో మొత్తం 150 టెంట్లు ఉంటాయి. సాధారణ, లగ్జరీ రూముల్లాగా.. ఇందులోనూ సాధారణ, లగ్జరీ, సూట్ టెంట్లు ఉంటాయి. ఇది సూట్ టెంట్ ఫొటో. ఇందులో నాలుగు విలాసవంతమైన పడక గదులు, అత్యాధునికమైన సదుపాయాలున్న బాత్రూంలు రెండు, ఇతర ఏర్పాట్లు ఉంటాయి. సూట్ టెంట్లో ఉండాలంటే రోజుకు రూ.2 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంటుంది.