Summative Assessment Exams
-
2 నుంచి సమ్మేటివ్ అసెస్మెంటు–1 పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లోని విద్యార్థులకు జనవరి 2వ తేదీ నుంచి సమ్మేటివ్ అసెస్మెంటు–1 పరీక్షలు పాఠశాల విద్యాశాఖ నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు ఎస్ఏ–1 పరీక్షలు జరుగుతాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు జనవరి 2 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఆయా తరగతుల పరీక్షల షెడ్యూల్ ఇలా.. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు : ఎలిమెంటరీ తరగతులకు (1–5) చెందిన విద్యార్థులకు 4వ తేదీ నుంచి 7 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. ఎలిమెంటరీలోని అన్ని తరగతులకు 4న ఫస్ట్ లాంగ్వేజ్, 5న ఇంగ్లిషు, 6న మేథమెటిక్స్ పరీక్షలుంటాయి. ఇక 7వ తేదీన 3, 4, 5 తరగతుల వారికి ఎన్విరాన్మెంటల్ సైన్సు పరీక్షలుంటాయి. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు: ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంటు–1 పరీక్షలు 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 వరకు 6, 8, 10 తరగతులకు, మధ్యాహ్నం 1.30 నుంచి 4.45 వరకు 7, 9 తరగతులకు పరీక్షలు జరుగుతాయి. 6–10 తరగతుల పరీక్షల షెడ్యూల్ ఇలా ► జనవరి 2న 6, 8, 10 తరగతులకు ఓఎస్సెస్సీ పేపర్–1 పరీక్ష ఉంటుంది. 7, 9 తరగతులకు కాంపోజిట్ కోర్సు సంస్కృతం, హిందీ, అరబిక్ పర్షియా పేపర్–1 పరీక్ష ► జనవరి 3న 8, 10 తరగతులకు ఓఎస్సెస్సీ పేపర్–2 పరీక్ష, మధ్యాహ్నం 9వ తరగతికి కాంపోజిట్ కోర్సు పేపర్–2 పరీక్ష ► జనవరి 4న ఉదయం, మధ్యాహ్నం 6 నుంచి 10 తరగతులకు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష ► జనవరి 5న 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ► జనవరి 6న 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీషు పరీక్ష ► జనవరి 7న 6, 7, 9, 10 తరగతులకు మేథమెటిక్స్, 8వ తరగతికి సోషల్ స్టడీస్ పరీక్ష ► జనవరి 9న 6 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులకు జనరల్ సైన్సు పరీక్ష ► జనవరి 10న 6, 7, 9, 10 తరగతులకు సోషల్ స్టడీస్ పరీక్ష, 8వ తరగతి విద్యార్థులకు మేథమెటిక్స్ పరీక్ష ► 8వ తరగతి జనరల్ సైన్సు, మేథమెటిక్స్ పరీక్ష పత్రాలు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకు వేర్వేరుగా ఉంటాయి. -
రెండు జిల్లాల్లో ఎస్ఏ–1 పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో 1–10 తరగతులకు నవంబర్ 1 నుంచి జరగాల్సిన సమ్మెటివ్ అసెస్మెంట్ –1 (ఎస్ఏ–1) పరీక్షను నవంబర్ 9 నుంచి నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నది. మిగతా జిల్లాల్లో ముందుగా ప్రకటించిన ప్రకారం ఎస్ఏ–1 షెడ్యూల్ అమలులో ఉంటుందని వెల్లడించింది. -
ఏప్రిల్ 2 నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి 9 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్–2 పరీక్షలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించింది. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు ఆయా పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల మూల్యాంకనాన్ని పూర్తి చేసి రిపోర్టు కార్డులను ఏప్రిల్ 12 కల్లా అందించేలా అన్ని పాఠశాలలకు సూచించాలని డీఈవోలను కోరింది. -
మార్చి 7 నుంచి వార్షిక పరీక్షలు
1 నుంచి 9వ తరగతి వరకు.. - ఎమ్మెల్సీ ఎన్నిక కారణంగా 9వ తేదీ నాటి పరీక్షలో మార్పు జరిగే అవకాశం - ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం - 14 నుంచి పదో తరగతి పరీక్షలు - మార్చి 21 నుంచే పైతరగతుల బోధన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలను వచ్చే నెల 7వ తేదీ నుంచి నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేసింది. అయితే వచ్చే నెల 9న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్నందున.. ఆరోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని విద్యాశాఖ భావిస్తోంది. వాటిని ఏయే తేదీల్లో నిర్వహించాలన్న దానిపై త్వరలో నిర్ణయించనున్నట్లు తెలిపింది. 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నందున... 9వ తేదీ నాటి పరీక్ష నిర్వహణకు మరొక రోజును ఖరారు చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీలైతే 15వ తేదీన నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది. 9వ తేదీన ఉదయమే పరీక్షలు పూర్తయితే మధ్యాహ్నం నుంచి టీచర్లు ఓటింగ్‌కు వెళ్లే వీలు ఉంటుందని, అలా నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్నీ పరిశీలిస్తున్నారు. మరోవైపు 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి... 17న ప్రోగ్రెస్ రిపోర్టులను విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు పంపిస్తారు. విద్యార్థుల మార్కుల వివరాలను 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు క్యుములేటివ్ రికార్డుల్లో నమోదు చేస్తారు. 20న తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ప్రోగ్రెస్ రిపోర్టులపై చర్చిస్తారు. విద్యార్థులు 21న తల్లిదండ్రుల సంతకాలు తీసుకుని క్యుములేటివ్ రికార్డులను స్కూల్లో అప్పగించాలి. అదే రోజు నుంచి 2017–18 విద్యా సంవత్సరం (పైతరగతుల బోధన) ప్రారంభం అవుతుంది. పరీక్ష వేళలివే.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వారికి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 6, 7 తరగతుల వారికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు 8వ తరగతి వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. వీరికి మార్చి 8వ తేదీన మాత్రం ఉదయం ఫిజిక్స్, మధ్యాహ్నం బయాలజీ పరీక్ష ఉంటాయి. మిగతవన్నీ సాధారణంగానే ఉంటాయి. 9వ తరగతి వారికి రోజూ ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి రెండు పేపర్లు.. ఉదయం 10 నుంచి 12:45 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు నిర్వహిస్తారు. తరగతుల వారీగా పరీక్షల షెడ్యూల్..