గాంధీ ఆస్పత్రికి ఎస్పీఎఫ్ భద్రత
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి ఇకపై ప్రత్యేక భద్రతా దళాలు రక్షణ కల్పించనున్నాయి. గాంధీ ఆస్పత్రికి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) విభాగం మంజూరైన విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్పీఎఫ్ డీఎస్పీ ఆంజనేయులుతో మంగళవారం సూపరింటెండెంట్ సమావేశమై బలగాలకు అవసరమైన వసతులు, విశ్రాంతి గది, ఆయుధాలు భద్రపర్చేందుకు చేయాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలను చర్చించారు. ఎనిమిది మంది ఎస్పీఎఫ్ సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండనున్నారు. త్వరలోనే వారి సేవలు అందుబాటులోకి రానున్నాయి.