విద్యార్థినులపై ఇన్విజిలేటర్ అసభ్యకర ప్రవర్తన
చీఫ్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసిన బాలికలు
నర్మెట : ఇంటర్మీడియట్ పరీక్ష ల విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించారని విద్యార్థులు స్థానిక కళాశాల ప్రిన్సిపాల్, ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరిం టెండెంట్ రాంచంద్రయ్యకు ఫిర్యాదు చేశారు. నర్మెట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేం ద్రంలో మూడు కళాశాల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. గురువారం పరీక్ష సమయంలో ఇద్దరు విద్యార్థులు బాత్రూంకు వెళ్లగా... వారి వెంబడి ఇన్విజిలేషన్ విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెళ్లి, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిం చాడు.
దీంతో చీఫ్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ విషయమై చీఫ్ సూపరిండెంట్‌ను సంప్రదించగా... విద్యార్థులు ఫిర్యాదు చేసింది వాస్తవమేనన్నారు. సదరు ఉపాధ్యాయుడిని పరీక్ష విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.