‘సూపర్‌లేజర్’ త్వరలో సాకారం!
మెల్బోర్న్: సైన్స్‌ఫిక్షన్, కామిక్స్ చిత్రాల్లో లేజర్ కిరణాల శక్తి ఎలా ఉంటుందో చూసే ఉంటాం. గోడలను చీల్చుకొని, కొండలను ఛేదించుకొని లేజర్ కిరణాలు ప్రత్యర్థిని మట్టుబెడుతుంటాయి. అయితే అదంతా కాల్పనికత మాత్రమే అనుకోవడానికి ఎంతమాత్రం వీల్లేదు. ఎందుకంటే సూపర్లేజర్ను సృష్టించే పనిలో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు.
వజ్రం గుండా లేజర్ కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా లేజర్ కిరణాల శక్తిని మరింతగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘తక్కువ ఎత్తులో ఎగురుతూ భద్రతకు సవాళ్లు విసురుతున్న డ్రోన్లను, క్షిపణులను ఎదుర్కొనేందుకు ఈ సూపర్‌లేజర్ వంటి ఆవిష్కరణల అవసరం ఎంతో ఉంది.’ అని ఆస్ట్రేలియాలోని మాక్వెయిరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రిచ్ మిల్డ్రెన్ అన్నారు.