The supply of alcohol
-
మద్యం సరఫరాకు బ్రేక్
ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో మద్యం సరఫరా నిలిచిపోయింది. విభజన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిక్కర్ బేవరేజెస్‌ను విభజించి ఆదాయ వ్యయాలు, అప్పులు, ఇతర లెక్కలను చూసేందుకు మే 27వ తేదీ నుంచి 2వ తేదీ వరకు బేవరేజెస్ అధికారికంగా సెలవులు ప్రకటించారు. కానీ ఈ సెలవులు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెలవుల నేపథ్యంలో జిల్లాలో మద్యం కొరత తలెత్తకుండా ఎక్సైజ్ శాఖ, బేవరేజెస్ అధికారులు వైన్‌షాపులు, బార్లకు వారి నెలవారీ లెసైన్స్‌ల స్థాయిని బట్టి ముందే కేటాయించారు. ఈ కారణంగా జిల్లాలో మే నెల చివరిలో మద్యం విక్రయాలు భారీగా జరిగినట్లు తెలుస్తోంది. మూడు నెలలుగా అంతంతమాత్రంగా విక్రయాలు... జిల్లాలో 156 వైన్స్ షాపులు , 44 బార్లు, మూడు క్లబ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు రూ.45 నుంచి రూ. 55 కోట్ల వరకు విక్రయాలు జరుగుతాయి. కానీ గడచిన మూడు నెలలుగా మాత్రం వ్యాపారం మాత్రం ఆశించిన రీతిలో జరుగలేదు. ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు, దాడులు నిర్వహించారు. దీంతో వ్యాపారులు భారీగా నిల్వలు చేసుకోకపోవడంతో ఆశించిన మే వ్యాపారం జరుగలేదు. కానీ మే నెలలో మాత్రం రూ.84.73 కోట్ల మేరకు విక్రయాలు జరిగాయి. సెలవులతో ఇబ్బంది... వేసవి సెలవులు కావడంతో మద్యం విక్రయాలు బాగుంటాయని ఆశించిన వ్యాపారులకు బేవరేజెస్ సెలవులు కొంత ఇబ్బందిగా మారాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల మద్యం కంపెనీల నుంచి వచ్చే మద్యానికి ఏపీ బేవరేజెస్ స్టిక్కర్ల ద్వారా విక్రయాలు జరిపేవారు. జాన్ 2న అపాయింటెడ్ డే కావటంతో రెండు రాష్ట్రాలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్రం విభజనకు ముందే బేవరేజెస్‌ను రెండు రాష్ట్రాలకు సమపద్ధతిలో కేటాయించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియ మొత్తం మే 28 నుంచి జూన్ 7వ తేదీ వరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే బేవరేజెస్‌కు కొద్ది రోజుల పాటు మూసి వేయాలని నిర్ణయించి నిల్వ ఉన్న మద్యాన్ని పూర్తిస్థాయిలో విక్రయించారు. పది రోజుల పాటు జిల్లాలో మద్యం సరఫరా లేకపోవడంతో వైన్స్, బారుల్లో అనివార్యంగా కొరత ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాలో రోజుకు సగటున పదివేల కేసుల మద్యాన్ని విక్రయిస్తుంటారు. నెలాఖరు కావడం, లెసైన్స్ కాలపరిమితి ముగియనుండడంతో వైన్ షాపుల్లో 30 శాతానికి తక్కువగానే మద్యం నిల్వలు ఉన్నాయి. అలాగే ఈ పదిరోజుల్లో విక్రయాలకు గాను జిల్లాలో లక్ష కేసులు మద్యం అవసరం ఉంది. మద్యం డిపోల బంద్ ఇంకొన్ని రోజులు పెరిగే అవకాశం..? డిపోలకు ఈ నెల 2 తేదీన మద్యం వస్తుందని అధికారులు చెబుతున్నప్పటికీ ఇంకా పది రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం బాటిళ్లపై వేసే సీల్, లేబుళ్లు, తెలంగాణ ప్రభుత్వ నూతన సీఎం సంతకం చేసిన తర్వాత బాటిల్‌కు వేయాల్సిన సీల్ మద్యం డిపోలకు వస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కనీసం 10 రోజుల సమయం పడుతుందని వైన్ షాపుల యజమానులు పేర్కొంటున్నారు. ఇదంతా జరిగితే జూన్ 15 వరకు మద్యం సరఫరాకు బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -

లిక్కర్ డిపోల మూసివేత
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో మద్యం డిపోలు పది రోజులపాటు మూతపడనున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు మద్యం కోసం చలానాలు కట్టిన వారికి మాత్రమే 27వ తేదీ సాయంత్రం వరకు మద్యం సరఫరా చేయనున్నారు. ప్రభుత్వ పరమైన లావాదేవీలకు ఎలాంటి చలానైనా బ్యాంకులో చెల్లించడంను ఈ నెల 24వ తేదీ నుంచి నిలిపేశారు. దీంతో 24వ తేదీ తరువాత చలానా కట్టేందుకు మద్యం వ్యాపారులకు వీలు లేకుండా పోయింది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు జూన్ 2వ తేదీన అధికారికంగా విడిపోనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ జూన్ 2 నుండే అధికారిక కార్యకలాపాలు సాగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎక్సైజ్ శాఖలో ఆదాయం, అప్పులు, స్థిర చరాస్తుల పంపకాలు పూర్తి చేయాల్సి ఉంది. దీనికి కనీసం పది రోజుల సమయమైన పట్టేఅవకాశం ఉంది. దీంతో జూన్ 6వ తేదీనే మద్యం డిపోలు తెరుచుకోనున్నాయి. మూతపడే పది రోజులకు గానూ స్టాక్‌ను ముందస్తుగా కొనుగోలు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం వ్యాపారులకు సూచించడంతో, రోజుకు రూ.2 కోట్లకు పైగా మద్యం పంపిణీ జరుగుతుంతోంది. ఇక గత ఐదు రోజులుగా మద్యం డిపో వద్ద మద్యం వ్యాపారులు బారులు తీరడంతో రోజుకు ఆదాయం రూ.5 కోట్లకు పైగానే ఎక్సైజ్ శాఖకు లభించింది. మద్యం కొరతకు దుకాణదారుల మొగ్గు జిల్లాలో మంచిర్యాల, ఊట్నూరులో మద్యం డిపోలు ఉన్నా యి. మంచిర్యాల మండలం గుడిపేటలో గల మద్యం డిపో పరిధిలో 65 దుకాణాలు, 8 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నా యి. ఉట్నూరు మద్యం డిపో పరిధిలో 88 దుకాణాలు, 16 బార్లు ఉన్నాయి. గత నాలుగైదు రోజులుగా మద్యం డిపోలు, మద్యం వ్యాపారస్తులతో కిటకిటలాడుతున్నాయి. జూన్ 6వ తేదీ తరువాతే మద్యం డిపోలు తెరుచుకోనుండడంతో, పది రోజులకు సరిపడా మద్యంను వ్యాపారస్తులు ఇదివరకే తరలించారు. మరోవైపు జూన్ 2వ తేదీన కొత్త ప్రభుత్వం ప్ర మాణ స్వీకారం అనంతరం ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాల కోసం మద్యం అవసరం ఉంటుంది. అసలే మ ద్యం కొరత ఉండడంతో, మద్యం వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి మద్యంను అధిక ధరలకు అమ్మేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ద్వారా గె లుపొందిన కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎ న్నుకోనుండగా, ఎంపీటీసీలు ఎంపీపీలను, జెడ్పీటీసీలు జె డ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికలు జరిగే తేదీ లను ఇంత వరకు ప్రకటించక పోవడంతో ఎన్నికలయ్యే వర కు వారు చేజారకుండా ఉండేందుకు క్యాంపులు ఏర్పాటు చే స్తున్నారు. దీంతో మద్యంకు డిమాండ్ బాగా ఏర్పడనుంది. దీన్ని ఆసరా చేసుకుని మద్యం దుకాణాల్లో స్టాకు లేదంటూ, కృత్రిమ కొరత సృష్టించేందుకు మద్యం వ్యాపారులు సిద్ధమవుతున్నారు. మద్యం స్టాకు లేదని, రెట్టింపు ధరలకు మద్యం ను అమ్మేందుకు మద్యం వ్యాపారులు సిద్ధమవుతుండగా, మద్యం ప్రియులకు పది రోజులపాటు జేబులకు చిల్లు పడడం ఖాయంగా కన్పిస్తుంది. దుకాణాల్లో ఉన్న స్టాకును ఎమ్మార్పీ ధరలకు అమ్మేలా ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటే, పది రోజుల వరకు మద్యం ప్రియులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే గత నెలలో జరిగిన ఎన్నికల పుణ్యమా అని మద్యం దొరక్క పడ్డ ఇబ్బందులు, మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. -
మద్యం వ్యాపారుల ముందు చూపు!
కామారెడ్డి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో మద్యం సరఫరా నిలిపివేయడానికి ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యాపారులు ముందుచూపుతో వ్యవహరించారు. విభజన విరామ సమయంలో మద్యం కొరత లేకుండా చూసుకోవడానికి గాను రెగ్యులర్ కన్నా రెట్టింపు డీడీలు చెల్లించి మద్యం తెప్పించుకుంటున్నారు. ఈ నెల 24 లోపు డీడీలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వ్యాపారులు ఇండెంట్ భారీగా ఇచ్చినట్టు సమాచారం. జూన్ 2న కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాతనే మద్యం సరఫరా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27 వరకే మద్యం సరఫరా అవుతుంది. దీంతో మద్యం వ్యాపారులు తమకు కావలసిన ఇండెంట్ ఇచ్చేసుకుని స్టాక్ కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చిన స్టాక్‌ను తమకు అనుకూలమైన ప్రాంతాల్లో భద్రపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల తరువాతనే మద్యం వచ్చే అవకాశం ఉండడంతో అప్పటి వరకు కొరత లేకుండా చూసుకోవాలని వ్యాపారులు ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మద్యం కొరత ఉంటే ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చన్న భావనతో ఉన్న కొందరు వ్యాపారులు ముందుచూపుతో స్టాక్ తెప్పించుకుని నిల్వ చేస్తున్నారు. వరుసగా వచ్చిన ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. చాలా చోట్ల మద్యం దొరక్క దుకాణాలు మూసి ఉంచాల్సి వచ్చింది. ఈ సమయంలో కొందరు వ్యాపారులు అడ్డగోలు ధరలకు మద్యం అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితిని ఊహించుకుంటున్నారు. తెలంగాణ రాష్ర్టం అధికారికంగా ఏర్పడిన సమయంలో ప్రజలు పండుగ చేసుకోవడానికి సన్నద్ధమవుతుండడంతో దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి మద్యం వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. జూన్ ఒకటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ సంబరాలు జరుపుకోవడానికి ఉద్యమకారులు, తెలంగాణ వాదులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరు దశాబ్దాల ఆకాంక్షకు అధికారిక గుర్తింపు వచ్చిన రోజును ఎప్పటికీ గుర్తుండేలా సంబరాలు చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. దీన్ని గుర్తించిన మద్యం వ్యాపారులు పెద్ద ఎత్తున మద్యం నిల్వలు చేస్తున్నట్టు సమాచారం. మద్యం నిల్వల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోవడంతో వ్యాపారులు భారీ ఎత్తున సొమ్ము చేసుకోనున్నారు. నకిలీ మద్యం వచ్చే అవకాశం... మద్యం సరఫరాకు విరామం ప్రకటించిన నేపథ్యంలో వ్యాపారులు ఒకవైపు నిల్వలు చేసుకుంటూనే మరోవైపు నకిలీ మద్యంను రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నాన్ డ్యూటీ పెయిడ్ మద్యంను తీసుకురావడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల సమయంలో కూడా కొందరు వ్యాపారులు నకిలీ మద్యం, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని తీసుకువచ్చి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారు. ఇప్పుడు అదే రకంగా ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. నకిలీ మద్యంపై ఆబ్కారీ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.