supply channel
-
మైక్రోసాఫ్ట్‌లో మూడో రౌండ్ తీసివేతలు, ఈసారి ఎవరంటే?
న్యూఢిల్లీ: టెక్దిగ్గజాల్లో వరుసగా ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మెటా మరో దఫా జాబ్ కట్స్‌ను ప్రకటించగా తాజాగా మైక్రోసాఫ్ట్ మూడవ రౌండ్ ఉద్యోగ కోతలను నిర్వహించింది.ముఖ్యంగా. సరఫరా గొలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)కి సంబంధించిన ఉద్యోగులను తొలగించింది. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ ప్రకటించిన 10వేల ఉద్యోగాల కోతలలో భాగంగానే వీరిని తొలగించిందని సీఆర్ఆన్ నివేదించింది. 689 మంది ఉద్యోగులను శాశ్వతంగా తొలగించినట్లు టెక్ దిగ్గజం సోమవారం తన సొంత రాష్ట్రానికి నివేదించింది. వివిధ స్థాయిలు, విధులు, టీమ్స్, భౌగోళికాల్లో ఉద్యోగాల కోతలు ఉన్నాయని కంపెనీని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.రికార్డుల ప్రకారం వాషింగ్టన్ రాష్ట్రంలో టెక్ దిగ్గజం ఇటీవల 689 మందిని ఫిబ్రవరిలో, 617 మంది ఉద్యోగులను తొలగించింది, ఇదే నెలలో, 108 మందిని, జనవరిలో, మైక్రోసాఫ్ట్ 878 మందిపై వేటు వేసింది. దీంతో వాషింగ్టన్ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,184కి చేరుకుంది. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌కు బై..బై చెప్పి ప్రత్యర్థి కంపెనీకి సీఎండీగా బాధ్యతలు కాగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగి లింక్డ్ఇన్ పోస్ట్ ప్రకారం, కంపెనీ తన ఏఐ ఆధారిత ఆటోమేషన ప్రాజెక్ట్ బోన్సాయ్‌ను మూసివేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం టీంను కూడా తొలగించింది. ప్రస్తుతం కంపెనీలో సుమారు 220,000కు పైగా ఉద్యోగులు ఉండగా, వీరిలో 5 శాతం మందిని లేఆఫ్స్ ప్రభావితం చేసింది. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం చివరి నాటికి మొత్తం పదివేల ఉద్యోగాలు తగ్గించే ప్లాన్లను గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఎర్రకాలువ నీరూ ‘కృష్ణా’ర్పణం
అనంతపల్లి (నల్లజర్లæ) : గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎర్రకాలువ నీరును పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలించే కార్యక్రమం ప్రారంభమైంది. ఎర్ర కాలువపై నబీపేట వద్ద ఉన్న గ్రోయిన్(అడ్డకట్ట)కు తాత్కాలిక మరమ్మతులు చేసి తద్వారా అనంతపల్లి సప్లై ఛానల్ నుంచి సైఫన్ దిగువన స్ట్రక్చర్ (10 తూరలు) ఏర్పాటు చేసి పోలవరం కుడికాలువలో ఎర్రకాలువ వరద నీరు కలుస్తుందని పట్టిసీమ ఎత్తిపోతల నీటితో పాటు ఈ నీరు కలుస్తుందని పనులు పర్యవేక్షిస్తున్న ఎర్రకాలువ ఏఈ భాస్కరావు తెలిపారు. సైఫన్ వద్ద షట్టర్ ఏర్పాటు చేసి వరద సమయంలో వచ్చే అదనపు (5 వేల క్యూసెక్కులు) నీటిని పోలవరం కాలువకు మళ్లిస్తారని చెప్పారు. అయితే దిగువ ప్రాంతంలో పంట పొలాలకు సాగు నీరు అందించకుండా సప్లై ఛానల్‌కు ఇసుక బస్తాలు అడ్డం వేసి మొత్తం నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారు. ఈ ఛానల్ ద్వారా నబీపేట, అనంతపల్లి, గుండేపల్లి, తూర్పుచోడవరం గ్రామాల్లోని1,200 ఎకరాల ఆయకట్టు భూముల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నబీపేట గ్రోయిన్ నుంచి సైఫన్ వరకు 1.80 కి.మీ మేర సప్లై ఛానల్ వెడల్పు చేసి కొంగువారుగూడెం రిజర్వాయర్ నుంచి వచ్చే నీటిని, రిజర్వాయర్ దిగువన జల్లేరు, బైనేరు, పులివాగుల నుంచి వచ్చే వరద నీటిని కృష్ణాకు తరలించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. దీనిపై నీటి పారుదల శాఖ అధికారులను వివరణ కోరగా నీటి తరలింపు విషయంలో తమకు ఎటువంటి ప్రమేయం లేదని, పట్టిసీమ పనులు చేపట్టిన ఇంజనీర్ల బృందం, కాంట్రాక్టు వారే ఈ పనులు చేపట్టారని చెబుతున్నారు.